నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యం
జనగామ రూరల్: యువతలో రాజకీయ అవగాహన, నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించడంమే ‘వికసిత భారత్’ లక్ష్యమని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. వికసిత భారత్ యూత్ పార్లమెంట్ అనేది భారతదేశంలో యువతకు కల్పించే ఒక ప్రత్యేక కార్యక్రమం అన్నారు. యువత పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని వివిధ సమస్యలపై తమ ఆలోచనలు, అభిప్రాయాలను వెలువరించడానికి, పరిష్కార మార్గాలు చూపడానికి ఒక అద్భుతమైన అవకాశమని చెప్పా రు. యువతీ యువకులంతా వికసిత్ భారత్ యూత్‌పార్లమెంట్‌లో ఏదైనా వెబ్ పోర్టల్‌ను ఈనెల 9వ తేదీలోగా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి అనగాని శ్రీనివాస్, నవీనారాణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ శాఖ పెన్షనర్లకు ప్రత్యేక అదాలత్
జనగామ రూరల్: పోస్టల్ శాఖ పెన్షనర్ల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అదాలత్ నిర్వహిస్తున్నట్లు హనుమకొండ పోస్టల్ అధికారి హన్మంతు ఒక ప్రకటనలో తెలిపారు. తపాలా శాఖ పరిధిలోని పెన్షనర్ల ఫిర్యాదులపై ఈనెల 25న మధ్యాహ్నం 12 గంటలకు గూగుల్ మీట్ ఏర్పాటు చేస్తున్నామని, ఫిర్యాదులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
జనగామ రూరల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన శనివారం(నేడు) జిల్లా కోర్టుఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి డి.రవీంద్ర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. సామరస్యంగా పరిష్కరించుకో దగిన, రాజీపడదగిన కేసులను ఇక్కడ పరిష్కరించుకోవాలని సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్ ఉంటుందని, కక్షిదారులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు.
టెన్త్ హాల్‌టికెట్ల విడుదల
జనగామ రూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు శుక్రవారం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయని జిల్లా విద్యాధికారి రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్ల విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తక్కవ ధరకే
జనరిక్ మందులు
బచ్చన్నపేట : పేదల సంక్షేమానికి ప్రధాన మంత్రి ఏర్పాటు చేసిన ‘జన ఔషధి’ కేంద్రాల్లో విక్రయించే జనరిక్ మందులు తక్కువ ధరకే లభిస్తాయి.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు అన్నారు. ‘జన ఔషధి’ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. మండల కేంద్రాల్లోనూ జన ఔషధి సెంటర్లను ఏర్పాటు చేయనున్నారని, వైద్య సిబ్బంది గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించి జనరిక్ మందులు కొనుగోలు చేసేలా చూడాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్‌గౌడ్, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ జిల్లా అధికారి స్వర్ణకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి సృజన, డాక్టర్లు మానస, ఝాన్సీ, ఎఫ్‌ఆర్ రమ్య, సీహెచ్‌ఓ జంగమ్మ, పీహెచ్‌ఎన్ అన్నాంబిక తదితరులు పాల్గొన్నారు.
నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment