నిరంతర విద్యుత్‌కు చర్యలు
● ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యసేవలకు ఆటంకం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్ అన్నా రు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావు, టెక్నికల్ డీఈ గణేష్, డివిజనల్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, కమర్షియల్ ఏడీఈతో కలిసి శనివారం ఆస్పత్రిని సందర్శించారు. విద్యుత్ సరఫరా లేని సమయంలో అత్యవసర సేవలకు 125 కేవీ సామర్థ్యం కలిగిన(సుమారు రూ.10లక్షలు) జనరేటర్, సీటీ స్కాన్ రూంలో ప్రస్తుతం ఉన్న 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 160 కేవీ అమర్చేందుకు ప్రతిపాదనలు పంపించాలని ప్రిన్సిపాల్‌ను కోరారు. ఇదిలా ఉండగా.. పంట కోతలు ముగియగానే వ్యవసాయ కనెక్షన్లు యుద్ధ ప్రాతిపదికన ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఎస్‌ఈ చెప్పారు. కొత్త సర్వీసుల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment