రంజాన్ ‘స్పెషల్’.. హరీస్
జనగామ: పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ముస్లింటు తెల్ల వారు జాము నుంచి సూర్యాస్తమయం వరకు రోజా(కఠోర ఉపవాస దీక్షలు) ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందు సహర్ వేళ ఆహారంతో పాటు బాదం, జీడి పప్పు, పిస్తా, అంజూర్, అక్రూట్, కిస్‌మిస్ వంటివి తీసుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
నోరూరించే హరీస్
రంజాన్ అనగానే హరీస్, హలీం వంటకాలు గుర్తుకు వస్తాయి. వీటిలో పోషక విలువలు అధికంగా ఉండడంతో వీటిని తినేందుకు ఆసక్తి చూపుతారు. ఉపవాస దీక్ష చేసేవారు ఎక్కువగా ఇఫ్తార్ తర్వాత హరీస్, హలీం ఆరగిస్తారు. మాసం, నెయ్యి, గోధుమ, రవ్వతో పాటు 20 రకాల పదార్థాలను హరీస్, హలీం తయారీకి ఉపయోగిస్తారు. జిల్లా కేంద్రంలో 20కిపైగా సెంటర్లు ఏర్పాటు చేశారు.
ఖర్జూరం.. ఈద్ ఫలం
ఖర్జూరం రంజాన్ ఈద్ ఫలంగా ప్రసిద్ధి. 100 గ్రాముల ఖర్జూరంలో 234 కేలరీల శక్తి, 1.8 గ్రాముల ప్రొటీన్లు, 55.6 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 0.5 గ్రాముల కొవ్వు, 7.6 గ్రాముల పీచు పదార్థం, 4 మిల్లీ గ్రాముల సోడియం, 60.9 మిల్లీ గ్రాముల పొటాషియంతో పాటు ఐరన్ విటమిన్ బీ పుష్కలంగా ఉంటాయి. ఇదే మోతాదులో ఎండు ఖర్జూరంలో ఉంటాయి.
అంజీరాతో రక్త శుద్ధి
అంజీరాలు రక్త శుద్ధి చేసి రక్తహీనతను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో 250 కేలరీల శక్తి, 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 30 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి.
ఎండు ఫలాల్లో శక్తి అధికం
ఎండు ఫలాల్లో(డ్రైఫ్రూట్స్) శక్తి అమోఘంగా ఉంటుంది. దీక్ష విరమించిన తర్వాత ప్రతి ముస్లిం తప్పక తీసుకునే వాటిలో ఇవే ప్రధానం. పిస్తా పప్పులో 559 కేలరీల శక్తి ఉంటుంది. 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 30 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. బాదం పప్పులో శరీరానికి మేలు చేసే కొవ్వు, రెండు శాతం ఐరన్ ఉంటుంది. దీంతో 250 కేలరీల శక్తి లభిస్తుంది. జీడిపప్పులో 550 కేలరీల శక్తి లభిస్తుంది. కిస్‌మిస్‌లో 299 కేలరీల శక్తిని అందించడం దీని ప్రత్యేకత. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు కూడా ఇది అందిస్తుంది.
తాజా పండ్లతో శక్తి..
ఈ కాలంలో దొరికే తాజా పండ్లు దీక్షలో ఉన్న వారు నీరసించి పోకుండా శక్తిని అందిస్తాయి. ద్రాక్షలో 70 గ్రాముల ఐరన్, అరటిలో 110 మిల్లీ గ్రాముల కార్బోహైడ్రేట్స్, కమలాలు, నిమ్మకాయలు, దానిమ్మలో పొటాషియంతో పాటు అధిక కేలరీల శక్తి ఉంటుంది.
పోషక విలువల డ్రైఫ్రూట్స్..
జోరందుకున్న పండ్ల వ్యాపారం
జిల్లా కేంద్రంలో 20కి పైగా సెంటర్లు
రంజాన్ ‘స్పెషల్’.. హరీస్
Comments
Please login to add a commentAdd a comment