అభ్యసన సామర్థ్యంపై సర్వే
జనగామ రూరల్: గత సంవత్సరం 1వ తరగతిలో ప్రవేశించి ఎఫ్‌ఎల్‌ఎన్ విధానంలో విద్యనభ్యసిస్తూ ప్రస్తుతం 2వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఎస్‌సీఆర్టీ ఎఫ్‌ఎల్‌ఎన్(ఫౌండేషన్, లిట్రసీ, న్యూమరసీ) శాంపిల్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు జిల్లా నుంచి ఇద్దరు మాస్టర్ ట్రైనర్‌లకు ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సర్వే చేపట్టడానికి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్‌గా ఎంపికై న 55 మంది ఛాత్రోపాధ్యాయులకు కూడా జిల్లా కేంద్రంలో రెండు రోజుల శిక్షణ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 50 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈనెల 10, 11, 12 తేదీల్లో సర్వే నిర్వహిస్తారు. 10వ తేదీ తెలుగు, 11వ తేదీ గణితం, 12వ తేదీ ఆంగ్లంలో సర్వే చేపడతారు. వీటితో పాటు హెచ్‌ఎం, టీచర్ అబ్జర్వ్ ఫామ్‌లు పూర్తి చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 50 పాఠశాలలు ఎంపిక చేయగా ఆయా పాఠశాలల్లోని 2వ తరగతి విద్యార్థుల్లో ర్యాండమ్ పద్ధతిలో 8 మందిని గుర్తించి వారికి మాత్రమే ఈ సర్వే నిర్వహిస్తారు. సర్వే నిర్వాహకులకు తెలుగు, గణితం, ఆంగ్లం టాస్క్ షీట్లను అందించారు.
సర్వే సజావుగా నిర్వహించాలి
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలోని రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల అభ్యసన స్థాయిని గుర్తించేందుకు చేపట్టే ఎఫ్‌ఎల్‌ఎన్ సర్వే సజావుగా నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా విద్యాశాఖ అన్ని విధాలుగా ఎఫ్‌లకు సహకరిస్తుంది. – బి.శ్రీనివాస్,
జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి
2వ తరగతి విద్యార్థులకు
‘ఎఫ్‌ఎల్‌ఎన్’ శాంపిల్ సర్వే
మూడు రోజుల పాటు నిర్వహణ
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు శిక్షణ పూర్తి
అభ్యసన సామర్థ్యంపై సర్వే
Comments
Please login to add a commentAdd a comment