దేవరుప్పుల: రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆర్థిక స్వాలంబన దిశలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇందిర మహిళా శక్తి పథకం కింద దేవరుప్పుల చందన మండల సమాఖ్యకు శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు అందించారు. జిల్లాలో ఆయా మండల సమాఖ్యలకు అందించేందుకు మంజూరైన ఏడు బస్సులకుగాను ప్రారంభోత్సవంలో దేవరుప్పుల మండలానికి అరుదైన అవకాశం లభించింది. దీంతో సమాఖ్య మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్ల ఉమ, మునిగొండ శారద, ఏపీఎం వెంకట్‌రెడ్డి, సిబ్బంది మొలుగూరి వెంకన్న తదితరులు హర్షం వ్యక్తం చేశారు. బస్సు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం మండల సమాఖ్యకు రూ.30 లక్షలు అందజేయాగా మిగతా ఖర్చులు సమాఖ్య భరించాల్సి ఉంటుంది. బస్సును జనగామ డిపోకు కేటాయించగా ప్రతీ నెల అద్దె రూపంలో రూ.77 వేలు సమాఖ్యకు చెల్లించాల్సి ఉంటుంది.
మహిళా దినోత్సవం సందర్భంగా అందించిన ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment