ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి నిధుల
జఫర్‌గఢ్: నిరుపేద విద్యార్థులకు అన్ని హంగులతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణాలకు నిధులను మంజూరు చే స్తూ ఆదివారం ఉత్తర్వులను జారీ చేసింది. జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేట శివారులో (కోనాయిచలం రెవెన్యూ గ్రామ పరిఽధిలో) ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో 26 ఎకరాల్లో స్కూల్ నిర్మించనున్నారు. ఈ భవన నిర్మాణ పనులను ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. భవన నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసింది. కొద్ది నెలల క్రితం ఎమ్మెల్యే కడియం శ్రీహ రి, కలెక్టర్ రిజ్వాన్, ఆర్డీఓ వెంకన్న తదితర అధికా రులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన విషయం విధితమే.
విద్యా హబ్‌గా జఫర్‌గఢ్
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు పెద్దపీట వేస్తూ అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు నాణ్య మైన విద్యను అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రెండో విడతలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని జఫర్‌గఢ్ మండలంలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. భవన నిర్మాణ పనులు పూర్తి అయితే జఫర్‌గఢ్ మండలం విద్యా హబ్ మారనుంది.
ఎమ్మెల్యే కడియం హర్షం
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. అన్ని హంగులతో విద్యార్థులకు ఒకే చోట నాణ్యమై న విద్యను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భ ట్టి విక్రమార్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
16న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment