దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయాలి
జనగామ రూరల్: స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా గూగుల్ మీట్ ద్వారా సంబందిత అధికారులను ఆదేశించారు. ఆదివారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి ఎల్‌ఆర్‌ఎస్‌పై ఆర్డీఓలు, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలతో గూగుల్ మీట్‌లో అవగాహన కల్పించారు. మార్చి 31వ తేదీలోగా ఎల్‌ఆర్‌ఎస్ చేసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని, ఇది ప్రతీఒక్కరి బాధ్యతగా తీసుకోవాలన్నారు. రుసుం చెల్లించిన దరఖాస్తును మున్సిపల్ వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీలు పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్, మండల కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు వెంకన్న, గోపిరామ్, జిల్లా పంచాయతీ అధికారిణి స్వరూప, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా పట్టణ, గ్రామీణ ప్రణాళిక శాఖ అధికారి వీరస్వామి, ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై విస్తృత ప్రచారం చేయాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment