వైభవంగా ధ్వజారోహణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ధ్వజారోహణం

Published Tue, Mar 11 2025 1:20 AM | Last Updated on Tue, Mar 11 2025 1:18 AM

వైభవం

వైభవంగా ధ్వజారోహణం

చిల్పూరు: శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయ అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు ధ్వజారోహణం, గరుడముద్ద కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్‌ శ్రీధర్‌రావు–కిరణ్మయి దంపతులు, ఉద్యోగులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.

శ్రీతిరుమలనాథస్వామి దేవాలయంలో..

స్టేషన్‌ఘన్‌పూర్‌: శ్రీతిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక ఆలయంలో సోమవారం ప్రధాన అర్చకులు కలకోట రామానుజచార్యులు, రంగాచార్యులు ఆధ్వర్యాన ధ్వజారోహణం, గరుడ ముద్ద, హోమం, బలిహరణం, దేవతాహ్వానం, భేరీపూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.

26న ఢిల్లీలో ధూం ధాం

జనగామ రూరల్‌: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 26న ఢిల్లీలో వందలాది మంది కళాకారులచే ‘ధూం ధాం’ నిర్వహిస్తున్నట్లు కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెరిపోతుల పరశురామ్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని ఓ పంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ‘చలో ఢిల్లీ’ సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌ కారణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పడింద ని, అలాంటి మహనీయుడి ఫొటో నోట్లపై ముద్రించకపోవడం ఆయనను విస్మరించడమే అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పులి శేఖర్‌, పిడుగు ఆశీర్వాదం, తిప్పరపు ప్రసాద్‌, తాళ్లపల్లి ఎల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు

ఉత్తమ ఉద్యోగులకు సత్కారం

జనగామ: జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్‌ శాఖలో ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసపత్రాలు అందుకున్న అధికారులు జ్యోతిర్మయి, భువనేశ్వరి, సోనియాను ఎస్‌ఈ టి.వేణుమాధవ్‌ సోమవారం సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ గణేష్‌, ఎస్‌ఏఓ జయరాజు, టెక్నికల్‌ ఏడీఈ తదితరులు పాల్గొన్నారు.

88 మంది గైర్హాజరు

జనగామ రూరల్‌: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలకు 88 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్‌ విద్యాధి కారి కె.జితేందర్‌రెడ్డి తెలిపారు. మొత్తం 4,132 విద్యార్థులకు గాను 4,044 పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. నర్మెట, జనగామ పరీక్ష కేంద్రాలను డీఐఓ, జఫర్‌గఢ్‌, ఘన్‌పూర్‌ సెంటర్లను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సభ్యులు సందర్శించారు.

యాసంగి ధాన్యం

కొనుగోళ్లు ప్రారంభం

జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లను సోమవా రం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బనుక శివరాజ్‌యాదవ్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరికి మంచి ధర రావాలంటే రైతులు ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకురావాల ని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. డైరెక్టర్లు నాగబండి రవీందర్‌, నామాల శ్రీనివాస్‌, బన్సీ నాయక్‌, బొట్ల నర్సింగరావు, అడ్తి అసోసియేష న్‌ అధ్యక్షుడు ఎం.వెంకన్న పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వైభవంగా ధ్వజారోహణం
1
1/2

వైభవంగా ధ్వజారోహణం

వైభవంగా ధ్వజారోహణం
2
2/2

వైభవంగా ధ్వజారోహణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement