సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారు ఐక్యంగా ఉంటే అద్భుతా లు సృష్టించగలరని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. సోమవారం కలెక్టరేట్‌లో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యా న మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. మహిళలు ఇంటా, బయట సమానత్వంతో పాటు జీవితంలో ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఆడ, మగ మధ్య వ్యత్యాసం చూడకూడదని, 80 శాతం మహిళలే జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు. వ్యాపార, వృత్తి, ఉపాధి రంగాల్లో మహిళ పాత్ర గణనీయమని, ఆడపిల్లను తల్లితండ్రులు తప్పనిసరి చదివించి వారికి అండగా నిలవాలని సూచించారు. అనంతరం ఐడీఓసీని పరిశుభ్రంగా ఉంచుతున్న మహిళా శానిటేష న్ సిబ్బందిని, మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మి కులను సత్కరించి బహుమతులు అందజేశారు. కేక్ కట్ చేసిన అనంతరం వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు, ఉత్తమ మహిళా ఉద్యోగుల కు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి ఫ్లోరెన్స్, డీపీఓ స్వరూప, డీఆర్డీఓ వసంత, డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు, జౌళి శాఖ అధికారి చౌడేశ్వరి, జెడ్పీ సీఈఓ మాధురీ కిరణ్‌చంద్రషా, డిప్యూటీ సీఈఓ సరిత, సీడీపీఓ రమాదేవి, మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ హెచ్.శారద, టీజీఓస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, టీఎన్జీఓస్ ప్రెసిడెంట్ ఖాజా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment