బాధ్యతగా పనిచేయాలి: సీపీ
స్టేషన్‌ఘన్‌పూర్/రఘునాథపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 16న స్టేషన్‌ఘన్‌పూర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లపై బాధ్యతగా పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోమవారం శివునిపల్లి పాలకుర్తి రోడ్డులో నిర్వహించే సీఎం బహిరంగ సభాస్థలంతో పాటు పార్కింగ్ స్థలాలు, హెలిప్యాడ్ ప్రాంతాన్ని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డివిజన్ పోలీసు అధికారులతో మాట్లాడారు. సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకో వాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అనంతరం రఘునాథపల్లి పోలీస్ స్టేషన్‌ను సీపీ సందర్శించారు. నమోదైన కేసులు, దర్యాప్తు వివరాలు, రికార్డుల గదులను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరరణ లో మొక్కల పెంపకం, పచ్చదనాన్ని చూసి పోలీసులను అభినందించారు. సీపీ వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీంశర్మ, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐలు జి.వేణు, ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సైలు నరేష్, వినయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
సభాస్థలాన్ని పరిశీలించిన ఆర్‌డీఓ
శివునిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగసభ నిర్వహించనున్న స్థలాన్ని ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న సోమవారం పరిశీలించారు. స్థలం చదును తదితర పనుల గురించి ఆర్‌అండ్‌బీ అఽధికారుల కు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment