గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
కొండపర్తికి నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
● ములుగు జిల్లా కొండపర్తి గ్రామాన్ని
దత్తత తీసుకున్న గవర్నర్
● అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం సమ్మక్క–సారలమ్మ దర్శనం
● గిరిజన గ్రామాల్లో అభివృద్ధిపై సమీక్షించనున్న జిష్ణుదేవ్
సాక్షిప్రతినిధి, వరంగల్ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ నుంచి బయల్దేరనున్న గవర్నర్.. దత్త త గ్రామం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామానికి రోడ్డు మార్గాన చేరుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌజ్‌లో భోజన విరామం తర్వాత హైదరాబాద్‌కు బయల్దేరుతారు. కాగా గవర్నర్ పర్యటన సందర్భంగా సోమవారం ము లుగు కలెక్టరేట్‌లో ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, ఎస్పీ శబరీష్, అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ దివాకర.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
● ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దత్తత గ్రామమైన కొండపర్తికి రోడ్డు మార్గాన బయలుదేరుతారు
● ఉదయం 11 గంటలకు కొండపర్తి గ్రామానికి చేరుకుంటారు
● 11 నుంచి 12.30 గంటల వరకు గవర్నర్ చేతుల మీదుగా వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, స్థానిక ఆదివాసీలతో గవర్నర్ మాటామంతి.
● మధ్యాహ్నం 12.30 గంటలకు కొండపర్తి నుంచి మేడారంలోని సమ్మక్క సారలమ్మ గుడికి రోడ్డు మార్గాన బయలుదేరుతారు.
● 12.45 నుంచి 1 గంట వరకు అమ్మవార్ల దర్శనాలు, మొక్కులు చెల్లించనున్నారు.
● 1 నుంచి 2 గంటల వరకు మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌజ్‌లో భోజన విరామం.
● 2 గంటలకు ఐటీడీఏ గెస్ట్ హౌజ్ నుంచి తిరిగి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణం.
● సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకోనున్న గవర్నర్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: తన దత్తత గ్రామమైన మండలంలోని కొండపర్తికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ నేడు (మంగళవారం) రానున్నారు. ఈనేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. కొండపర్తిలో ట్రైబల్‌వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీహాల్, పాఠశాల భవనానికి మరమ్మతులు, ప్రహరీ నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రానికి ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి చేశారు. అంతేకాకుండా నిర్మించిన బహుళ ఉపయోగ భవనంలో కారంపొడి మిల్లు, మహిళలకు కుట్టు మిషన్లను సిద్ధం చేశారు. గవర్నర్ అభివృద్ధి పనులను ప్రారంభించి బిర్సాముండా, కొమురంభీం విగ్రహాలను మంత్రి సీతక్కతో కలిసి ఆవిష్కరించనున్నారు.
కొండపర్తిలో అధికారులు
గవర్నర్ రాక నేపథ్యంలో జిల్లా అధికారులు కొండపర్తి బాట పట్టారు. ఆయా శాఖల వారీగా ఏర్పాట్లు చేశారు. గర్నవర్ జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడేందుకు వేదిక సిద్ధం చేస్తున్నారు. గ్రామంలోని రోడ్లు శుభ్రం చేసి సైడ్ బర్మ్‌కు మట్టి పోశారు. కొండపర్తిలో ప్రత్యేక హెల్త్ క్యాంపు ఏర్పాటుకు డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు గ్రామాన్ని సందర్శించి పరిశీలించారు. ట్రైబల్ వెల్పేర్ ఈఈ వీరభద్రం దగ్గరుండి ఏర్పాట్లు చేయించారు. స్థానిక ఎంపీడీఓ సుమనవాణి, ఎంపీఓ శ్రీధర్‌రావు పరిశుభ్రత ఏర్పాట్లను సిబ్బందితో చేయించారు. ఇదిలా ఉండగా.. సోమవారం సాయంత్రం కలెక్టర్ దివాకర ఏర్పాట్లను పరిశీలించారు.
పీహెచ్‌సీలో అత్యవసర గది ఏర్పాటు
గవర్నర్ కొండపర్తికి వస్తున్న నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం తాడ్వాయి పీహెచ్‌సీలో అత్యవసర గదిని సిద్ధం చేశారు. ఈ గదిలో రెండు పడుక మంచాలు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచారు. డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు గదిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రణధీర్, వైద్యాధికారి అడెపు చిరంజీవి, సిబ్బంది ఉన్నారు.
రోడ్డు నిర్మించాలి
కొండపర్తి స్టేజీ నుంచి గ్రామం వరకు రోడ్డును బాగు చేయాలి. గతంలో బీటీ రోడ్డు పనులను మొ దలు పెట్టగా అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు నిలిచిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి. – చింత కౌసల్య, కొండపర్తి
ఆర్థికాభివృద్ధికి భరోసానివ్వాలి..
కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం సంతోషంగా ఉంది. మహిళ కోసం కుట్టు మిషన్లు, కారంపొడి మిల్లు నెలకొల్పారు. మహిళలకు డైరీ ఫాంలు, ఫౌల్ట్రీఫాంలు నెలకొల్పితే కుటుంబాలకు ఆర్థికభరోసా ఉంటుంది.
– రజిత, కొండపర్తి
గవర్నర్ టూర్ షెడ్యూల్ ఇలా..
గవర్నర్ దత్తత శుభపరిణామం
అటవీ ప్రాంతంలో ఉన్న కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకోవడం సుభపరిణామం. సాగునీటి కోసం బోర్లు నిర్మిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేసుకునే ఆలోచనలో ఉన్నాం.
– అరెం లచ్చుపటేల్,
మేడారం జాతర చైర్మన్
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
Comments
Please login to add a commentAdd a comment