లక్ష్యం చేరారు..!
కష్టపడ్డారు..
గ్రూప్– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ
● పలువురికి మెరుగైన ర్యాంకులు
● ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షకు సన్నద్ధం
● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్‌కుమార్ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్. తల్లి రాధ అంగన్‌వాడీ హెల్పర్‌గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ బీటెక్ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వహించారు. 2021లో వీఆర్‌ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్ మండలంలోని అంబటిపల్లిలో పనిచేశారు. ఆ సంవత్సరంలోనే గ్రూప్–4 పరీక్షలో ప్రతిభ కనబరిచి హైదరాబాద్‌లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. అదేశాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా ప దోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓవై పు ఉద్యోగం చేస్తూనే 2024 డిసెంబర్‌లో జరి గిన గ్రూప్–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్‌ను గ్రామస్తులు అభినందించారు.
ముల్కలపల్లి యువకుడు
ఉపేందర్..
డోర్నకల్: గ్రూప్–2 ఫలి తాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్ ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విదులు నిర్వర్తిస్తూ గ్రూప్–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్‌ను గ్రామస్తులు అభినందించారు.
కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్ 2019 హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌లోని కోచింగ్ తీసుకుని గ్రూప్స్ పరీక్షలు రాశారు. డిసెంబర్‌లో వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్షలో 380 మార్కులు సాధించగా.. గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా ప్రణీత్‌కు స్థానిక పద్మశాలి సంఘం నాయకులతోపాటు మిత్రులు అభినందనలు తెలిపారు.
ప్రణీత్ ప్రతిభ..
లక్ష్యం చేరారు..!
లక్ష్యం చేరారు..!
లక్ష్యం చేరారు..!
Comments
Please login to add a commentAdd a comment