పెండింగ్ వేతనాలు చెల్లించాలి
● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు
జనగామ రూరల్: జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాల హాస్టల్ వర్కర్స్‌కు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మెడికల్, ఎంసీహెచ్ ఆస్పత్రి కార్మికుల వేతనాలు చెల్లించాలని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. తక్షణమే వేతనాలు చెల్లించకుంటే సీఎం పర్యటనలో ఆందోళన చేస్తామన్నారు. ఈ సమావేశంలో రామ్‌దయాకర్, ఏనుగుల రఘు, జి.అజయ్ స్వామి, రూతు భారతి, ప్రశాంత్, గోపాలకృష్ణ, స్వప్న, కవిత, రజిత, ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment