రాణించిన రైతు బిడ్డ
రేగొండ: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మూలగుండ్ల భాగ్యమ్మ, సాంబరెడ్డి కుమారుడు ఉపేందర్ రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభావంతుడు. గ్రూప్–2 ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 28వ ర్యాంకు సాధించాడు. ఉపేందర్ ప్రస్తుతం పలిమెల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలోనూ పంచాయతీ కార్యదర్శిగా నాలుగేళ్లపాటు సేవలందించాడు. ప్రస్తుతం గ్రూప్–2లో ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులతోపాటు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment