జనగామ రూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణ లో డీఈఓ రమేశ్ నేతృత్వాన విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. శాంతి భద్రతల విషయమై డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యాన ఏసీపీ, సీఐ, ఎస్సైలు, పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పా టు చేస్తున్నారు. జిల్లాలో 180 పాఠశాలకు చెందిన 6,238 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నా రు. ఇందుకు 41 సెంటర్లను కేటాయించారు. ఉద యం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలకు మాత్రం ఉదయం 9.30 నుంచి 11 గంటల సమయం ఇచ్చారు. సెంటర్ల వద్ద సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్టు–2023(144 సెక్షన్) అమలులో ఉంటుంద ని డీసీపీ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ర్యాలీలు, మైకులు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిషేధమని, ఇంటర్‌నెట్, జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. పదో తరగతి పరీక్షలకు మొదటి సారిగా ప్రభుత్వం క్యూర్‌కోడ్ విధానంతో 24 పేజీల ఆన్సర్ షీట్లను తీసుకు వచ్చింది. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పారదర్శకంగా జరిగేలా దృష్టి సారించింది.
6,238 మంది విద్యార్థులు..
41 పరీక్ష కేంద్రాలు
క్యూఆర్ కోడ్‌తో 24 పేజీల ఆన్సర్ షీట్