జనగామ రూరల్: మెడికల్, ఎంసీహెచ్ ఆస్పత్రి వర్కర్లకు వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల హాస్టల్ వర్కర్స్‌కు ఐదు నెలలుగా, ఎంసీహెచ్ వర్కర్స్‌కు రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కొత్త కాంట్రాక్టర్‌ను త్వరగా నియమించి కార్మికులకు రెగ్యులర్‌గా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు ఏనుగుల రఘు, గండి అజయ్ పాల్గొన్నారు.