ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
పరిష్కరించాలని
గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలు
● వివిధ సమస్యలపై 66 అర్జీల అందజేత
● సమస్యలపై దృష్టి సారించండి :
● ఆదేశించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ/జనగామ రూరల్: ‘ఎస్సై కొట్టాడు. స్టేష న్‌కు రమంటున్నారని ఓ బాధితుడు.. నోటీసులు ఇవ్వకుండానే కాల్వ పనులు చేస్తున్నారని రైతులు.. బై నంబర్లతో భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని పలువురు’.. ఇలా అనేక సమస్యలతో గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలు అధికారుల ఎదు ట తమ గోడు చెప్పుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై 66 అర్జీలు రాగా.. వాటిని కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్ స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన వినతులపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించి ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు. మండల స్థాయి గ్రీవెన్స్‌పై విస్త్రృ ప్రచారం చేపట్టడంతో పాటు దరఖాస్తులను వేగంగా పరిశీలించాలని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ ఈనెల 31లోగా పూర్తి చేయాలని, తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేసిన 12 గ్రా మాల్లో మార్కింగ్ త్వరగా పూర్తిచేయాలని చెప్పా రు. గ్రీవెన్స్‌లో డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సరిత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బైపాస్–2ను పరిగణనలోకి తీసుకోవాలి
బచ్చన్నపేట మండలం మొండికుంట శివారు తుమ్మబాల స్కూల్ ఏరియా నుంచి బైపాస్–2ను పరిగణనలోకి తీసుకోవాలని ప్లాట్ల బాధితులు బియ్య లింగయ్య, వడ్డెపల్లి వెంకటరెడ్డి, కరికె కిష్టయ్య, సందెల మల్లయ్య, బాలరాజు, బూరుగు భాస్కర్, గుర్రపు రమేష్, కరీముల్లా, కృష్ణ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్‌హెచ్–365బి బైపాస్ రోడ్డు నిర్మాణ సమయంలో ప్రతిపాదిత 3ఏ భూసేకరణ ఆపాలని హైకోర్టుకు వెళ్లగా పనుల్లో యధాస్థితిని పాటించాలని కోర్టు ఆదేశించిందని చెప్పారు. అయితే ప్రతిపాదిత బైపాస్ నిర్మాణం ఊరి మధ్య నుంచి పోతుండడంతో ప్రమాదాలు జరిగే అవకా శం ఉందనీ.. కోర్టు ఆదేశాలున్నా సంబంధిత అధికారి వినతులపై పేషీ నిర్వహించకుండా కొట్టివేసి ప్రొసీడింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. సంబంధిత అధికారిపై చర్య తీసుకుని బైపాస్ ఆప్షన్–2ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
వినతుల్లో కొన్ని..
● స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ కోసం 2008 సంవత్సరం చేపట్టిన భూసేకరణలో రైతు చింతకుంట నర్సింహారెడ్డికి చెందిన నాలుగెకరాల భూమి తీసుకోగా రూ.9,52,768 నష్టపరిహా రం వచ్చింది. ఆ డబ్బు తీసుకోకుండా ఫారం–ఈ ద్వారా సరెండర్ చేశారు. సమస్య పరిష్కరించి డబ్బులు ఇప్పించాలని నర్సింహారెడ్డి అర్జీ పెట్టుకున్నాడు.
● దేవరుప్పుల మండలం కోలుకొండకు చెందిన జూకంటి ఐలయ్యకు సంబంధించిన 3.04 ఎకరాల భూమికి పట్టా పాసు బుక్కులు మంజూరయ్యాయి. అవి తనకు ఇప్పించాలని ఐలయ్య దరఖాస్తు చేసుకున్నాడు.
భూమి ఎక్కువ ఎలా వచ్చింది..?
రఘునాథపల్లి మండలం కుర్చపల్లిలోని ఓ సర్వే నంబర్ పరిధిలో 11.18 ఎకరాల భూమి ఉండగా.. 12.34 ఎకరాల భూమి ఎలా వచ్చిందని రైతులు ముచ్చ వాసుదేవరెడ్డి, నల్ల శ్యామ్, బానోతు గోపా ల్, లక్య, జోగ్య, మినుకూరి విజేందర్‌రెడ్డి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఎకరం 16 గుంటల భూమి పెంచి, ఆ సర్వే నంబర్‌పై బై వేసి రిజిస్టర్ చేయించుకున్నారని తెలిపారు. సమగ్ర విచారణ చేపట్టి భవిష్యత్‌లో తమకు ఇబ్బందులు కలుకుండా చూడాలని వారు వినతిపత్రం ఇచ్చారు.
స్టేషన్‌కు రమంటున్నారు..
గత నవంబర్ 11న పాలకుర్తి నుంచి తండాకు బైక్‌పై లిఫ్టు తీ సుకుని వెళ్తున్నాను. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా బైక్ యజమాని తనను దింపి వెనక్కి వెళ్లిపోయాడు. కాలినడకన తండాకు వెళ్తుండగా పోలీసులు ఆపి బైక్ ఎటు వెళ్లిందని అడగ్గా లిఫ్టుతో వస్తున్నాను.. నాకు తెలి యదని చెప్పగా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. పాలకుర్తి ఆస్పత్రిలో వైద్యం చేసుకుని హనుమకొండ పెద్దాస్పత్రికి పోయిన. తర్వాత సీపీ, డీసీపీ, సీఐకి ఫోన్‌లో చెప్పిన. అయితే ఎస్సై ఫోన్‌చేసి ఆధార్ తీసుకు ని స్టేషన్‌కు రమ్మంటున్నారు. న్యాయం చేయాలి.
– జరుపుల భిక్షపతి, చీమలబాయి తండా
12 మండలాలు..
మూడే అర్జీలు
● తహసీల్ గ్రీవెన్స్‌కు స్పందన కరువు
– వివరాలు 9లోu
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య