అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: వేసవిలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంగళవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా ఇన్‌పుట్, అవుట్‌పుట్, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు, ఇతర సాంకేతిక పరంగా ఎదురయ్యే అంశాలలో లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని తెలిపారు. అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధంగా ఉంచడం, లోడ్ మేనేజ్‌మెంట్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం వంటి చర్యలను అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ మల్చూర్‌నాయక్, అధికారులు పాల్గొన్నారు.
ఎరువుల కొరత లేకుండా చూడాలి..
ఎరువుల కొరత రాకుండా రైతులకు సకాలంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని రాంసాయి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్, జంగేడులోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, రైతుల అవసరాలకు తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 1,950 టన్నుల యూరియా డీలర్ల దగ్గర, 650 టన్నులు మార్కెఫెడ్ వద్ద అందుబాటులో ఉందని తెలిపారు. రానున్న వారం రోజుల్లో అదనంగా రెండు వేల టన్నులు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఏఓ విజయభాస్కర్, భూపాలపల్లి ఏఓ సతీష్ పాల్గొన్నారు.
మహిళా ఆర్థిక సాధికారతతోనే దేశాభివృద్ధి..
మహిళా ఆర్థిక సాధికారత ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవ మహిళా సాధికారత పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కుటుంబంలో ఆర్థిక ప్రగతి కనబడాలంటే అందరూ తప్పనిసరిగా పొదుపును పాటించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి తిరుపతి, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment