కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రెండు ప్రభుత్వ మద్యం షాపులను ఎకై ్సజ్ అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, శివరాత్రి జాతర నేపద్యంలో రెండు రోజులు బంద్ చేశారు. దీంతో బుధవారం జాతరలో బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. బెల్టు షాపు నిర్వాహకులకు ముందుగానే పెద్దమొత్తంలో మద్యం డంప్ చేసి అమ్మకాలు చేపట్టారు. బెల్టుషాపుల్లో ఒక మద్యం క్వార్టర్‌పై రూ.100లకు విక్రయించి భక్తుల జేబులకు చిల్లు వేశారు. ఇంత జరుగుతున్న ఎకై ్సజ్‌శాఖ అధికారులు గాలి వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వచ్చిన భక్తులు అధిక ధరలకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయారని విమర్శలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment