నేడే పోలింగ్
భూపాలపల్లి అర్బన్: నేడు (గురువారం) జిల్లాలో జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయగా బుధవారం ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. కలెక్టరేట్‌లో రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోలింగ్ మెటీరియల్‌ను అందించారు. జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, ఓటు హక్కు కలిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. నాలుగు రూట్లుగా విభజించి ప్రతీరూట్‌కు ఒక లైజన్ అధికారి, రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం స్థానానికి జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ న్నికలకు భూపాలపల్లి, మొగుళ్లపల్లి చిట్యాల, గ ణపురం, టేకుమట్ల, రేగొండ, కొత్తపల్లిగోరి మండల కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ ఎన్నికల్లో 215 మంది ఓటర్లు తమ ఓటు హ క్కును వినియోగించుకోనున్నారు. మెదక్–నిజా మాబాద్– ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాలకు మంథని నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హ ర్, పలిమెల మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 83 మంది, పట్టభద్రుల ఎమ్మెల్సీకి 2,483 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, సిబ్బంది పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది
నేడే పోలింగ్
నేడే పోలింగ్
Comments
Please login to add a commentAdd a comment