హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
వాజేడు: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన నాలుగు మండలాల స్థాయి వాలీబాల్ పోటీల్లో విజేతగా పూసూరు టీం నిలిచింది. మండల కేంద్రంలో బుధవారం సాగిన ఫైనల్ పోటీల్లో వాజేడు, పూసూరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చెరొక సెట్టు గెలిచి సమంగా నిలిచినప్పటికీ నిర్ణయాత్మక ఫైనల్ సెట్లో పూసూరు జట్టు విజేతగా నిలించింది. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన పూసూరు జట్టుకు వాజేడు ఎస్సై రాజ్‌కుమార్ రూ. 15,016 నగదు, షీల్డ్, ద్వితీయ స్థానంలో నిలిచిన వాజేడు జట్టుకు నగదు రూ.10,016 నగదు, షీల్డ్‌ను అందజేశారు. తృతీయ స్థానంలో నిలిచిన రాంపురం జట్టుకు రూ.5,016, షీల్డ్, నాల్గో స్థానంలో నిలిచిన దూలాపురం జట్టుకు రూ.3,016 నగదుతో పాటు షీల్డ్ అందించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకర్లపూడి విక్రాంత్, మాజీ సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, వత్సవాయి జగన్నాథరాజు, దాట్ల వాసు, తోలెం చందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
విజేతగా నిలిచిన పూసూరు జట్టు
రన్నరప్‌గా వాజేడు
Comments
Please login to add a commentAdd a comment