ఇసుక పిరం | - | Sakshi
Sakshi News home page

ఇసుక పిరం

Published Fri, Feb 28 2025 1:49 AM | Last Updated on Fri, Feb 28 2025 1:44 AM

ఇసుక పిరం

ఇసుక పిరం

టీజీఎండీసీ ఆన్‌లైన్‌లో టన్నుకు రూ.650వరకు కొనుగోలు చేస్తారు. 16 టైర్లు లారీలో 47.500 టన్నులు, 14 టైర్లు లారీలో 42టన్నులు, 12టైర్లు లారీలో 35 టన్నులను (లారీ బరువుతో కలిసి) తరలిస్తారు. వరంగల్‌ మార్కెట్‌లో సన్నరకం ఇసుక టన్నుకు రూ.1,600–1,800 వరకు, దొడ్డురకం టన్నుకు రూ.1,400–1,500వరకు, హైదరాబాద్‌ పట్టణాల్లో రూ.2వేల నుంచి 2,300 వరకు, దొడ్డు రకం టన్నుకు రూ.1,800 వరకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌కు ఇసుక లారీల్లో తరలిపోవాలంటే గతంలో రూ.35వేల నుంచి రూ.40వేల వరకు ఉండేది. ప్రస్తుతం ధరలు పెరగడంతో రూ.50వేల నుంచి 60వేల వరకు ధరలు పెరిగాయి. ఇదివరకు ఒక్కోలారీలో రెండు నుంచి మూడు టన్నులు అదనంగా తరలించేవారు. ఇదివరకు వరంగల్‌లో రూ.1,100–1,200, హైదరాబాద్‌లో రూ.1,500 వరకు ఇసుకను విక్రయించేవారు. నిబంధనలు కఠినమై ఇసుకకు భారీగా డిమాండ్‌ పెరిగిందని సామాన్యులు ఆందోళన పడుతున్నారు.

కాళేశ్వరం: వేసవి కావడంతో నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ లాంటి పట్టణాల్లో సన్న ఇసుకకు డిమాండ్‌ బాగా పెరిగింది. సర్కార్‌ ఇసుక లోడింగ్‌ నిబంధనలు కఠినం చేయడంతో ధరలు అమాంతం పెరిగి వినియోగదారుల్లో కలవరం మొదలైంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించి నిబంధనల మేరకు విక్రయాలు జరగాలని సీరియస్‌గా హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. 25రోజులుగా అక్రమాలకు తావులేకుండా మైనింగ్‌, రెవెన్యూ, పోలీసుశాఖల పర్యవేక్షణలో టీజీఎండీసీ ఆధ్వర్యంలో లోడింగ్‌ జరుగుతుంది. నిబంధనల మేరకు లోడింగ్‌ వ్యవహారం జరుగుతుందా లేదా అనే విషయమై పలుమార్లు పోలీసు, విజిలెన్స్‌, ఇంటిలిజెన్స్‌, అదనపు కలెక్టర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారులు క్వారీల బాటపట్టి పరిస్థితిని సమీక్షించారు.

8 క్వారీల్లో లోడింగ్‌..

మహదేవపూర్‌ మండలంలో ఇసుక రీచులు 8వరకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మద్దులపల్లి(పలుగుల–7), అన్నారం, పలుగుల–6, పలుగుల–3, పూస్కుపల్లి–1, పూస్కుపల్లి పార్టు–2, బొమ్మాపూర్‌, ఎలికేశ్వరంలో క్వారీలు టీజీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నిత్యం ఈ క్వారీలకు గతంలో 100కుపైగా లారీలు వచ్చేవి. ప్రస్తుతం లోడింగ్‌ కఠినం చేయడంతో కొన్ని క్వారీలకే లారీలు ఇసుకకు వస్తున్నారు.

అమాంతం పెరిగిపోయిన

ధరలు

టీజీఎండీసీ ఆన్‌లైన్‌లో

టన్ను ఇసుకకు రూ.650 వరకు..

నెల కిందట మార్కెట్‌లో టన్నుకు

రూ.900–1,200 వరకు విక్రయం

ప్రస్తుతం రూ.1,800–2,300

వినియోగదారుల ఆందోళన

ఎలికేశ్వరం క్వారీ వద్ద

ఇసుక లోడింగ్‌

ధరలకు రెక్కలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement