ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ ఓటింగ్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నిర్వహించిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం–వరంగల్–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 93 శాతం, కరీంనగర్–నిజామాబాద్–మెదక్–ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 92 శాతం, పట్టభద్రుల ఓటింగ్ 76 శాతం జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరిగినట్లు తెలిపారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో 329మంది ఓటర్లకుగాను 308 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 93.62శాతం, నిజామాబాద్–మెదక్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు 2,483 మందికి గాను 1,903మంది ఓటు హక్కు వినియోగించుకోగా 76శాతం నమోదైనట్లు తెలిపారు. నిజామాబాద్–మెదక్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 83మంది ఓటర్లు ఉండగా 77మంది ఓటు హక్కు వినియోగించుకొగా 92 శాతం నమోదైనట్లు తెలిపారు. పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య వరంగల్, కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు పోలింగ్ సామగ్రి పంపనున్నట్లు వివరించారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
భూపాలపల్లి, కాటారం మండలాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పరిశీలించారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ, భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్లు శ్రీనివాసులు, నాగరాజు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.
– మరిన్ని ఫొటోలు 9లోu
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ ఓటింగ్
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ ఓటింగ్
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ ఓటింగ్
Comments
Please login to add a commentAdd a comment