కోటగుళ్లలో లింగోద్భవ రుద్రాభిషేకం
గణపురం: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో గురువారం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ లింగోద్భవ రుద్రాభి షేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహాఅన్నపూజ కార్యక్రమాన్ని అర్చకులు గంగాధర్, వినయ్, నాగరాజు, విజయ్‌కుమార్, శంకర్ నిర్వహించారు.
జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన
భూపాలపల్లి అర్బన్: మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌పై జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని వారసంతలో మోబైల్ వ్యాన్‌తో అవగాహన కల్పించారు. జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది సూచించారు. క్షణికావేశాలకు పోయి, పగలు, పంతాలు పెంచుకొని కేసుల్లో ఇరికితే, పోలీస్ స్టేషన్లు కోర్టులకు ఎక్కితే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. విలువైన సమయం, డబ్బు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు.
మహిళలకు క్రీడాపోటీలు
భూపాలపల్లి అర్బన్: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు, మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 1న అంబేడ్కర్ స్టేడియం, థౌసండ్ క్వార్టర్స్, మార్చి 3న ఇల్లంద క్లబ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన వారికి మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.
వసంతోత్సవానికి వేళాయె..
● నేటి నుంచి నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ–25’
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ప్రతీ ఏడాది విద్యార్థులే నిర్వాహకులుగా మూడు రోజులపాటు వసంతోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ–25) నిర్వహించనున్నారు. నేటి నుంచి(శుక్రవారం)మార్చి 1, 2 తేదీల్లో నిర్వహించే కల్చరల్ ఫెస్ట్‌కు ఏర్పాట్లు చేశారు. నాటి ఆర్‌ఈసీ నేటి నిట్‌లో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా నిలుస్తున్న నిట్‌లో వివిధ దేశాల సంస్కృతీసంప్రదాయలను పరస్పరం పంచుకునేందుకు 1978లో ప్రారంభమైన వసంతోత్సవం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్‌గా పేరుగాంచింది. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరుకానున్నారు.
తొలిరోజు: తొలిరోజు శుక్రవారం సాయంత్రం అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో హాస్యనటుడు, గిన్నిస్ వరల్ రికార్డు గ్రహీత, పద్మశ్రీ బ్రహ్మానందం, విద్యార్థుల చిట్‌చాట్.
రెండో రోజు: శనివారం ప్రోషోలో భాగంగా ఇండియన్ రాక్‌బ్యాండ్ వార్డెక్స్ ఫ్యూజన్ మ్యూజిక్‌తో అలరించనున్నారు. డైరెక్టర్ కట్స్‌లో సినీ డైరెక్టర్లతో చిట్‌చాట్. అల్యూర్‌లో భాగంగా ఫ్యాషన్ షో, నుక్కడ్ నాటక్ ప్రదర్శన
మూడో రోజు: ముగింపులో భాగంగా ఆదివారం పాపులర్ సింగర్ అమిత్ త్రివేది హిందీ, ఇంగ్లిష్ సంగీత విభావరి. నిపుణులతో బైక్‌స్టంట్స్.
ఈసారి థీం లేదు: స్ప్రింగ్ స్ప్రీ వేడుకలను ప్రతీ ఏడాది ప్రత్యేక థీంతో నిర్వహించేవారు. 2022లో సృష్టిగా, 2023లో కళాధ్వనిగా, 2024లో రాసంగేన్ థీం (ఇతివృత్తం) తో నిర్వహించారు. ఈసారి అదేపేరుతో స్ప్రింగ్ స్ప్రీ–25ను నిర్వహించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
కోటగుళ్లలో లింగోద్భవ రుద్రాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment