కాలనీల్లో పర్యటించిన కమిషనర్
భూపాలపల్లి అర్బన్: పట్టణంలోని పలు కాలనీల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శుక్రవారం పర్యటించారు. రాజీవ్‌నగర్, కారల్‌మార్క్స్‌కాలనీల్లో ఇంటింటికీ తిరిగి తాగునీటి సరఫరాను పరిశీలించారు. ప్రతి రోజు నీటి సరఫరా సరిగా వస్తుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా నీటిని వృథా చేయవద్దన్నారు. అనంతరం పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో వాటర్ సప్లై, ఎలక్ట్రిషన్ స్టాక్ రిజిస్టర్‌లు, మెటీరియల్స్, సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్‌ను కొనసాగించాలని పట్టణంలో వీధి దీపాల అంతరాయం ఉండకుండా ఎప్పటికప్పుడు మరమ్మతు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ మానస, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment