పల్లెల్లో 74.62శాతం ఆస్తిపన్ను వసూలు
భూపాలపల్లి: ఆస్తి పన్నుల వసూలులో గ్రామ పంచాయతీలే ముందున్నాయి. జిల్లాలోని ఏకై క భూపాలపల్లి మున్సిపాలిటీ లక్ష్యం చేరుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 30 రోజులు మాత్రమే గడువు ఉండగా పల్లెలు వందశాతానికి చేరువ కానుండగా మున్సిపాలిటీలో మాత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది.
పల్లెలే బెస్ట్..
జిల్లాలోని 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటి నుంచి రూ. 4కోట్ల 4లక్షల 52వేల 378 ఆస్తి పన్ను రావాల్సి ఉండగా నిన్నటి(శుక్రవారం) వరకు 74.62 శాతం వసూలు అయ్యాయి. మిగిలిన బకాయిలను ఈ నెల చివరిలోపు వసూలు చేసేందుకు పంచాయతీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అత్యధికంగా కాటారం మండలంలో 91.36 శాతం, మొగుళ్లపల్లిలో 81.64 శాతం వసూలు అయ్యాయి. టేకుమట్ల 64.98 శాతం వసూలు చేసి చివరి స్థానంలో నిలిచింది. ఈ నెల చివరిలోపు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 90 శాతానికి పైగా పన్ను వసూలు జరిగే అవకాశాలున్నాయి.
మున్సిపాలిటీ లక్ష్యం చేరేనా..?
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో నివాస, వ్యాపార, నివాస, వ్యాపార భవనాలు 12,223 ఉన్నాయి. వాటి నుంచి రూ. 5.75 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉండగా.. నిన్నటి వరకు 60.84 శాతం రూ.3.50 కోట్లు వసూలు అయ్యాయి. రూ.2.25 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. బకాయిల వసూలు కోసం మున్సిపాలిటీ అధికారులు నెల రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో ఐదుగురు అధి కారులను నియమించారు. వీరు భారీ మొత్తంలో పన్ను బకాయి ఉన్న వారి భవనాల వద్దకు వెళ్లి నోటీసులు జారీ చేస్తూ పన్నులు వసూలు చేస్తున్నారు. అ యినప్పటికీ పన్నులు చెల్లించని పక్షంలో ఆస్తులను సైతం జప్తు చేస్తున్నారు. అయినప్పటికీ వసూలు అంతంత మాత్రంగానే అవుతోంది.
మున్సిపాలిటీలో 60.84 శాతమే
స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా
ఫలితం అంతంతే
మిగిలింది 30 రోజులే
Comments
Please login to add a commentAdd a comment