ఉద్యోగ విరమణ తప్పనిసరి
భూపాలపల్లి రూరల్: ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన గుండు నాగభూషణం–పద్మ దంపతులను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. గృహోపకరణాలను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. పోలీసులంటేనే ఎన్నో రకాల త్యాగాలతో పాటు, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తారన్నారు. సుమారు 40 సంవత్సరాల పాటు సర్వీస్ పూర్తిచేసిన హెడ్ కానిస్టేబుల్ నాగభూషణం సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాగభూషణం అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చె ప్పారు. ఏదేని సమస్యలు ఉంటే రిటైర్డ్ ఉద్యోగులు తనను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవా లని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఎస్సైలు నగేష్, కిరణ్, శ్రీకాంత్, రత్నం, పోలీసు అధికారుల సంఘం నేత యాదిరెడ్డి పాల్గొన్నారు.
ఎస్పీ కిరణ్‌ఖరే
Comments
Please login to add a commentAdd a comment