ప్రశ్నించినందుకే హత్య చేశారు..
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో జరుగుతున్న అక్రమాలు, న్యాయం కోసం ప్రశ్నిస్తూ, కోర్టులో కేసులు వేయడం వలనే సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని హత్య చేశారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నారాయణ తెలిపారు. పౌర హక్కుల సంఘం నాయకులు శుక్రవారం రాజలింగమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా భూ అక్రమాలు, మాఫియాలపై కేసులు వేస్తే 80మంది వరకు హత్యగావించబడ్డారన్నారు. ఈ హత్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయి ప్రజలు తిరగబడుతారని తెలిపారు.
పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు
Comments
Please login to add a commentAdd a comment