సెలూన్ షాపుల బంద్ సంపూర్ణం
భూపాలపల్లి రూరల్: జిల్లా కేంద్రంలోని మంజూర్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ సెలూన్‌తో పాటు కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా నాయీబ్రాహ్మణులు బుధవారం చేపట్టిన సెలూన్ షాపుల బంద్ సంపూర్ణమైంది. ఈ సందర్భంగా నాయీబ్రాహ్మణులు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసు రాజశేఖర్ మాట్లాడుతూ కార్పొరేట్ సెలూన్ వ్యవస్థలో వెనక్కి తగ్గకుంటే రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. నాయీబ్రాహ్మణులకు జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పందిళ్ల రమేష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు దుబ్బాక సంపత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ గిరి సమ్మయ్య, మండల అధ్యక్షుడు మంతెన భూమయ్య, నాయకులు వంగపల్లి సుదర్శన్, మురహరి శంకర్, జంపాల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.