
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● టీజీ జేఏసీ జిల్లా కన్వీనర్ రవి
భూపాలపల్లి అర్బన్ : జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీజీ జేఏసీ జిల్లా కన్వీనర్ బూరుగు రవి కోరారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యోగుల పెండింగ్‌లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించేలా ముఖ్యమంత్రితో మాట్లాడాలని కోరినట్లు తెలిపా రు. ఉద్యోగులు సమస్యతో సతమత మవుతున్నా రని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేయడంతోపాటు రాష్ట్రస్థాయిలో ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లతో సదస్సు నిర్వహిస్తా మన్నారు. అనంతరం రాష్ట్రస్థాయిలో మహాధర్నా చేపేట్టేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ బాధ్యులు పాల్గొన్నారు.
కమిటీ ఎన్నిక
అంతకుముందు జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా జేఏసీ నూతన చైర్మన్‌గా బూరుగు రవి, ప్రధాన కార్యదర్శిగా శైలజ, అడిషనల్ సెక్రెటరీ జనరల్‌గా రేగురి సుభాకర్‌రెడ్డి, దశరథ్, సందాని, భార్గవ్, ప్రవీణ్, కోకన్వీనర్లుగా శంకరయ్య, సేవానాయక్, రఘువీర్, కిరణ్, వివిధ విభాగాలకు కన్వీనర్లను నియమించారు.