
ఏటేటా పెరుగుతున్న ధరలు
భూపాలపల్లి రూరల్: పత్తి విత్తనాల ధర ఏటేటా ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో ఒక విత్తనపు సంచికి రూ.36 పెరిగింది. ఈ లెక్కన జిల్లా మొత్తంలో సుమారుగా రూ.90 లక్షలకు పైగా రైతులపై భారం పడనుంది. జిల్లాలో సాగయ్యే పంటల్లో పత్తి ప్రధాన పంట కాగా, వచ్చే వానాకాలం సీజన్‌కు సంబంధించిన పత్తి విత్తనాల ధరను ప్రభుత్వం ఖరారు చేసింది. వాతావారణం అనుకూలించక దిగుబడి తగ్గడం మద్దతు ధర రాకపోవడం, ఎరువులు, కలుపు తీత, కూలీల ఖర్చులు అమాంతం పెరిగి రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఈ తరుణంలో పత్తి విత్తనాల ధరల పెరుగుదల రైతులను మరింత కుంగదీస్తోంది.
పత్తికే ప్రాధాన్యం..
జిల్లాలో రైతులు ఎక్కువ శాతం పత్తి సాగుకు మొగ్గు చూపుతుంటారు. పత్తి ధర మార్కెట్‌లో నిలకడగా రూ.వేయి, రూ.రెండు వేలు ఎక్కువ తక్కువతో ఉంటుంది. దీంతో కరువు కాటకాలు వచ్చినా.. దిగుబడి తగ్గినా.. పెట్టుబడి నష్టపోవడం ఉండదనే భావన రైతుల్లో ఉంది. దీంతో రైతులు వరితోపాటు పత్తి పంటకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.
పెరుగుతున్న ఖర్చులు..
ఏటేటా సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. దీనికి తోడు విత్తనాలు పురుగు మందులు, కూలీల వేతనాలు కలిపి రూ.వేలల్లో పెట్టుబడి అవుతుంది. కూలీల రవాణా ఖర్చులు తడిచి మోపెడవుతున్నా యి. ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.12 వేల వ రకు కలుపు తీత కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది.
ధరలు అదుపులో ఉంచాలి
ప్రభుత్వం ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల ధరలను అదుపులో ఉంచాలి. పత్తి విత్తనాల ధరలు ప్రతి ఏడాదీ పెంచుతున్నారు. దీంతో రైతులపై భారం పడుతోంది. ధరలను పెంచకుండా అందుబాటుతో ఉంచాలి. ప్రభుత్వం పత్తితోపాటు, మిర్చి, వరి విత్తనాలను సబ్సిడీపై అందిస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది.
– కాపరబోయిన రాకేష్, రైతు,
కొత్తపల్లి (ఎస్‌ఎం) భూపాలపల్లి
●
విత్తన ధరలు ఇలా..
జిల్లాకు 2.50లక్షల విత్తన సంచులు అవసరం
సబ్సిడీపై అందించాలని రైతుల వేడుకోలు

ఏటేటా పెరుగుతున్న ధరలు

ఏటేటా పెరుగుతున్న ధరలు