
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
చిట్యాల: వినియోగదారుల ఫిర్యాదులను విద్యుత్ సిబ్బంది త్వరితగతిన పరిష్కరించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ ఎన్.వేణుగోపాలచారి అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన వినియోగదారులకు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేణుగోపాలచారి హాజరై మాట్లాడారు. ఈ లోకల్ కోర్టులో లూస్‌లైన్‌లు, మిడిల్ ఫోల్స్, అగ్రికల్చర్ సర్వీస్‌లు, తదితర వాటికి సంబంధించిన సమస్యలపై వినియోగదారుల నుంచి 14 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. రెండు ఫిర్యాదులు అక్కడికక్కడే పరిష్కరించినట్లు తెలిపారు. మిగితా 14 ఫిర్యాదులు కేసులు రిజిస్టర్ చేసి 45 రోజులలో పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫైనాన్స్ మెంబర్ ఆర్.చరణ్‌దాస్, ఇండిపెండెంట్ మెంబర్ ఎం.రామారావు. టెక్నికల్ మెంబర్ కె.రమేష్, ఎస్‌ఈ మల్చూర్, ఏఓ రాజ్‌కుమార్, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ సందీప్ పాటిల్, ఏఈలు చంద్రశేఖర్, మణిదీప్, సంజయ్, సబ్ ఇంజనీర్‌లు సుమంత్, వెంకటేష్, శ్రీనివాస్, విద్యుత్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ వేణుగోపాలచారి