
జాగ్రత్తలు పాటించాలి..
వేసవి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. ఎండ తీవ్రతతో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలోనే శరీరంలోని ఉప్పుశాతం తగ్గిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. పలుచని దుస్తులు ధరించాలి. పిల్లలకు అరగంటకు ఒకసారి ఓఆర్‌ఎస్, కొబ్బరి నీరు తాగించాలి. నూనె పదార్థాలు తినొద్దు. పండ్ల రసం ఎక్కువ తీసుకోవాలి. వేసవిలో విహారయాత్రలు, సుదీర్ఘ ప్రయాణాలు శ్రేయస్కరం కాదు. తప్పని పరిస్థితుల్లో వెళ్లాలనుకుంటే పండ్ల రసాలు, కొబ్బరి నీరు, నీరు ఎక్కువ తీసుకోవాలి. లేదంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.
– గంట చంద్రశేఖర్, సూపరింటెండెంట్,
మహదేవపూర్ సీహెచ్‌సీ
●