
ఉద్యోగ ఉత్తర్వుల అందజేత
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో నూతనంగా సింగరేణి కారుణ్య నియమాక ఉద్యోగాలు పొందిన వారికి మంగళవారం ఉద్యోగ ఉత్తర్వులు అందజేసినట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి తెలిపారు. జీఎం కార్యాలయంలో ఇన్‌చార్జ్ జీఎం వెంకటరామరెడ్డి ఉత్తర్వులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం కవీంద్ర, అధికారులు రవి, అరుణ్‌ప్రసాద్, రాజు, యూనియన్ నాయకులు రమేష్, మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు.
డీటీఎఫ్ జిల్లా కమిటీ ఎన్నిక
భూపాలపల్లి అర్బన్: డెమెక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) జిల్లా కమిటీ ఎన్నిక మంగళవారం నిర్వహించినట్లు ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, ఉపాధ్యక్షుడు చాప బాబుదొర తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా చిలువేరు అశోక్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి, దేవేంద్ర, తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తిరుపతి, కార్యదర్శులుగా వీరేశం, బొజ్జనాయక్, వీరన్న, ప్రభాకర్, రాష్ట్ర కౌన్సిలర్స్‌గా సుదర్శనం, జయ, రమణరెడ్డి, లక్ష్మణ్‌నాయక్, ప్రభాకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సుదర్శన్, వెంకటేశ్వరచారి, అడిట్ కమిటీ కన్వీ నర్‌గా దేవేందర్‌రెడ్డి, సభ్యులుగా మొండయ్య, జయప్రకాశ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ముగిసిన ‘టెన్త్ స్పాట్’
విద్యారణ్యపురి: కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్‌లో ఈ నెల 7వ తేదీనుంచి ప్రారంభమైన టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ మంగళవారం సాయంత్రం ముగిసింది. అన్ని సబ్జెక్టులు, ఒకేషనల్ కోర్సుల పరీక్షల జవాబుపత్రాలు కలిపి 2,27,403 జవాబుపత్రాలు వచ్చాయి. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలనుంచి ఎస్‌ఏలు, ఎస్‌జీటీలను స్పాట్ విధులకు కేటాయించారు. సీఈలుగా 113మంది, ఏఈలుగా 676మంది ఎస్‌ఏలు, 224మంది ఎస్‌జీటీలు స్పెషల్ అసిస్టెంట్‌లుగా విధుల్లో పాల్గొన్నారు. హనుమకొండ డీఈఓ వాసంతి క్యాంపు ఆఫీసర్‌గా, 8మంది పీజీహెచ్‌ఎంలు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా వ్యవహరించారు. ఈ నెల 30న లేదా మే మొదటివారంలో పరీక్ష ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఐక్యతతోనే సమస్యల పరిష్కారం
భూపాలపల్లి అర్బన్: కార్మికుల ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కరించబడుతాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్ తెలిపారు. ఏరియాలోని కేటీకే 5వ గని లో రమేశ్ మంగళవారం కార్మికులను కలిసి వా రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనింగ్ స్టాప్ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా కమిటీ ఉండాలని, మైన్స్, ఏరియా వారీగా ఏర్పాటు చేసి మైనింగ్ స్టాప్‌ను బలోపేతం చే యాలన్నారు. ఈ నెల 20న ఏరియాలోని కొమురయ్య భవన్‌లో మైనింగ్ స్టాప్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపా రు. ఈ సమావేశాన్ని నాయకులందరూ సకా లంలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు తిరుపతి, ఆసిఫ్‌పాషా, సుధాకర్‌రెడ్డి, రామచందర్, నారాయణమూర్తి, అఖిల్, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రయాణికురాలికి
తీవ్రగాయాలు
కాటారం: ఆర్టీసీ బస్సు దిగబోయి కిందపడిపోయి మహిళ తీవ్రగాయాలపాలైన ఘటన కాటారం మండలం మేడిపల్లి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పులి స్వరూప బస్వాపూర్ సమీపంలోని నాయకపల్లి వద్ద తన కూతురుని చూడటానికి భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో వచ్చింది. బస్వాపూర్ స్టేజ్ దాటిన తర్వాత స్వరూప బస్సు ఆపాలని డ్రైవర్, కండక్టర్‌ను కోరింది. డ్రైవర్ బస్సు నిలుపననడంతో సదరు మహిళ బతిమిలాడింది. మేడిపల్లి టోల్‌గేట్ సమీపానికి బస్సు చేరుకోగా కండక్టర్ స్వరూపను దిగమని చెప్పాడు. ఆమె దిగుతుండగా డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో స్వరూప బస్సు మెట్లపై నుంచి కిందపడింది. కాలు మడిమపై నుంచి బస్సు టైరు వెళ్లింది. తీవ్రగాయమై రక్తస్రావం అవగా స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగానే స్వరూప గాయాలపాలైనట్లు ఆమె బంధువులు ఆరోపించారు.