
ఎప్పుడో..!
కలగానే భూపాలపల్లి ట్రాఫిక్, మహిళా పోలీస్‌స్టేషన్లు
ఠాణాల
ఏర్పాటు
● తొమ్మిదేళ్ల క్రితం సర్కారుకు ప్రతిపాదనలు
● ముందుకు కదలని ఫైలు
● ఇబ్బందుల్లో వాహనదారులు,
మహిళలు
మహిళా స్టేషన్ ఏది..?
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో పురుషులు 2,07,998 మంది ఉండగా.. మహిళలు 2,08,765 మంది ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపు అయి ఉంటుంది. జిల్లాలో మహిళా పోలీస్‌స్టేషన్ లేకపోవడంతో మహిళలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబపరమైన, వేధింపులకు సంబంధించి సమస్యలను నేరుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు తెలిపేందుకు ఇబ్బందిపడాల్సి వస్తుంది. మహిళా స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే కుటుంబ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
భూపాలపల్లి: జిల్లాకేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో ట్రాఫిక్, మహిళా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు కలగానే మారింది. జిల్లా ఏర్పాటైన సమయంలో ఇక్కడి పోలీసు అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపగా స్టేషన్ల ఏర్పాటు నేటికీ కాగితాలకే పరిమితమైంది. ఫలితంగా జిల్లావాసులు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు.