
‘భూ భారతి’ సదస్సులకు ఏర్పాట్లు చేయండి
భూపాలపల్లి: నూతన రెవెన్యూ చట్టం భూ భారతిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండలస్థాయిలో సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ.. తహసీల్దార్లను ఆదేశించారు. ఐడీఓసీ సమావేశపు హాల్‌లో బుధవారం తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, గిర్దావర్లతో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన రెవెన్యూ చట్టం భూ భారతిపై రూపొందించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాల నిర్వహణకు ప్రచారం చేయాలని సూచించారు. అవగాహన సదస్సులకు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చేలా గ్రామాల్లో టామ్ టామ్ వేయించాలన్నా రు. రెవెన్యూ శాఖలో పని చేసే ప్రతీ ఉద్యోగికి ఈ నూతన చట్టంపై సమగ్రమైన, స్పష్టమైన అవగాహ న ఉండాలని తెలిపారు. ‘భూ భారతి చట్టం – రైతు ల చుట్టం’ అనే నాలుగు పేజీలతో కూడిన పుస్తకా న్ని తహసీల్దార్లకు అందజేశారు. అంతకుముందు భూ భారతి చట్టం విధి విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కా టారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, గిర్దావర్లు పాల్గొన్నారు.
షెడ్యూల్ ప్రకటించిన కలెక్టర్..
జిల్లాలో నిర్వహించనున్న భూ భారతి అవగాహన సదస్సుల షెడ్యూల్‌ను కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటించారు. ఈ నెల 17వ తేదీన గణపురం మండల కేంద్రంలోని రైతు వేదిక, 19న కాటారం రైతు వేదిక, 21న భూపాలపల్లి పట్టణంలోని ఏఎస్‌ఆర్ గార్డెన్, 22న చిట్యాల రైతు వేదిక, 23న ఉదయం 10 గంటలకు మొగుళ్లపల్లి రైతు వేదిక, మధ్యాహ్నం 2 గంటలకు టేకుమట్ల ఎంఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్, 24న మహాముత్తారం మండలం బోర్లగూడెం రైతు వేదిక, 25న ఉదయం రేగొండ రైతు వేదిక, మధ్యాహ్నం గోరికొత్తపల్లి మండలం చిన్నకోడెపాక రైతు వేదిక, 26న మల్హర్‌రావు మండలం కొయ్యూరు రైతు వేదిక, 28న ఉదయం మహదేవపూర్ రైతు వేదిక, మధ్యాహ్నం పలిమెల ప్రాథమిక పాఠశాల ఆవరణలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మధ్యాహ్నం జరిగే సదస్సుకు హాజరయ్యే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీడ, మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఇళ్ల మంజూరుకు విచారణ
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు విచారణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పొరపాట్లుకు తావులేకుండా నిరుపేద లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని 145 గ్రామ పంచాయతీల పరిధిలో 33,089 దరఖాస్తులు, మంథని నియోజకవర్గ పరిధిలోని 84 గ్రామ పంచాయతీల్లో 18,634, మొత్తంగా 51,723 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని.. జాబితాను తిరిగి గెజిటెడ్ అధికారి ద్వారా సూపర్ చెక్ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ నరేష్, గృహనిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
షెడ్యూల్ విడుదల