జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
గట్టు: పెరుగుతున్న సాంకేతికను అందిపుచ్చుకుంటూ ఏఐ(ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్) ద్వారా వ్యవసాయ రంగాన్ని సులభంగా, సమర్థవంతంగా, లాభం చేకూర్చేలా చేపట్టిన జాతీయ స్థాయి పోటీల్లో తప్పెట్లమొర్సు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. గట్టు మండలం తప్పెట్లమొర్సు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బెంగళూరులో శనివారం నిర్వహించిన జాతీయ స్థాయి ప్రదర్శనలో తమ ప్రతిభను చాటుకుని ద్వితీయ బహుమతిని అందుకున్నారు. ఈ–విద్యాలోక ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో బ్రెయినాక్ ఛాలెంజ్ పోటీల్లో భాగంగా తప్పెట్లమొర్సు విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఆధునిక సాంకేతికత ఏఐని ఉపయోగించి వ్యవసాయ రంగాన్ని మరింత సమర్థవంతంగా, లాభాయదాయకంగా మార్చే విధానాలను విద్యార్థులు బి.షర్మిల, బి.ఇందులు బెంగళూరు పట్టణంలో నిర్వహించిన ప్రదర్శనలో ప్రదర్శించి, జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతిని అందుకున్నట్లు హెడ్మాస్టర్ ఆగస్టిన్ తెలిపారు. ఈమేరకు విద్యార్థులను ఉపాధ్యాయులు ఆశోక్, నర్సింహులు, రాఘవేంద్ర, రియాజ్, మోసెస్, మండల కోఆర్డినేటర్ రంగస్వామి, మంజులలు విద్యార్థులకు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.
జిల్లా ఆస్పత్రి
సూపరింటెండెంట్‌గా ఇందిర
గద్వాల క్రైం: జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఇందిర అన్నారు. శనివారం ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల ఆసుపత్రి మెడికల్ కాలేజ్ పరిధిలోకి వెళ్లిందన్నారు. వైద్యులు, సిబ్బంది, మౌలిక వసతులు కొరత లేకుండా విధుల నిర్వహణ ఉంటుందన్నారు. అనంతరం పలు వార్డులలో సేవలు పొందుతున్న రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ, ఫిరోజ్‌రెహమన్ కలిసి పలు సమస్యలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆమె అన్నారు. ఇక్కడ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వినోద్‌కుమార్ అలంపూర్ ఏరియా ఆసుపత్రికి బదిలీపై వెళ్లారు.
నిర్దేశిత రుసుం
వసూలు చేయాలి
గద్వాల: మీ–సేవ కేంద్రాలు అంకితభావంతో పని చేయాలని ఈడీఎం శివ కోరారు. శనివారం గద్వాల పట్టనంలోని మీసేవ కేంద్రాలను ఈడీఎం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మీసేవ కేంద్రాలలో సిటిజన్ చార్ట్ నోటిస్ బోర్డ్, సర్టిఫికేట్, రిజిష్టర్, టోల్‌ఫ్రీ కాల్ నంబర్స్ ను ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ప్రజల నుంచి ఆరా తీవారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు సిటిజన్ చార్ట్ సర్టిఫికేట్స్ రిజిష్టర్ గురించి వినియోగదారులకు వివరించారు. ఈ సందర్భంగా ఈడీఎం శివ మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యాలు కలిగించకుండా మీసేవలపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా నిర్ధేశించిన రుసుము మాత్రమే తీసుకోవాలని, అదనంగా తీసుకున్న యెడల మీసేవ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నూతన రేషన్‌కార్డుల సర్వీసులకు రూ.45 మాత్రమే చెల్లించాలని వినియోగదారులకు సూచించారు. అలాగే ప్రజలకు మెరుగైన సేవలందించడమే మీసేవ కేంద్రాల లక్ష్యం అని ఆయన తెలిపారు. ధరల పట్టిక కూడా క్షుణంగా కేంద్రాలలో ఉండాలని సూచించారు. వారి వెంట డీఎం సుదాకర్ రెడ్డి, మీసేవ నిర్వహకులు సురేష్, హమ్‌జాద్, తదితరులు ఉన్నారు.
జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment