వంద మీటర్ల దూరంలోనే..
లోకో ట్రైన్ ద్వారా 13.3 కి.మీ., వరకు చేరుకున్న టీం సభ్యులు బురదలోకి దిగే ప్రయత్నాలు చేస్తున్నా.. వంద మీటర్ల దూరంలో అంత చీకటిగా ఉండటంతో ఏమీ చేయలేక వెనుదిరిగి వస్తున్నారు. ఆదివారం వెళ్లిన బృందాలకు కన్వేయర్ బెల్టు కిందనే నీటి ఊట ఉండటంతో దానిపై నడుచుకుంటూ వెళ్లగా.. సోమవారం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజాగా కన్వెయర్ బెల్టు సైతం మునిగిపోయినట్లు సమాచారం. తెగిపోయిన కన్వేయర్ బెల్టును సరిచేసి ఇప్పుడు దాని ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. అలాగే సోమవారం నుంచి నీటిని తోడేందుకు 100 హెచ్‌పీ మోటార్లు ఏర్పాటు చేసినా నీటి ప్రవాహం ఏమాత్రం తగ్గడం లేదని, ఒకవేళ బురద, రాళ్లను తొలగిస్తూ.. ముందుకెళ్తే మరింత ముందుకు వచ్చే అవకాశం ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
● ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఆర్మీ చీఫ్‌తో మాట్లాడి స్పెషల్ ఎక్విప్‌మెంట్ తెప్పించే ప్రయత్నాలు చేస్తోంది. మూడు రోజులుగా విడతల వారీగా వెళ్తున్న బృందాలు నీళ్లు, బురద ఉండటంతో లోపలికి వెళ్లలేకపోతున్నామనే విషయం తప్ప చిక్కుకుపోయిన వారు కనిపించారనే సమాచారం చెప్పడం లేదు. దీంతో వారు ఇంకా బతికే ఉన్నారా అన్న చర్చ మొదలైంది. మరోవైపు మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారుల హడావుడి తప్ప.. లోపల చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం లేదు. దీంతో సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే.. మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment