ఎల్‌ఆర్‌ఎస్ రాయితీని సద్వినియోగం చేసుకోండి
గద్వాలటౌన్ : అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్) పథకాన్ని ప్రకటించిందని, తాజాగా దీనిపై ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ దశరథ్ తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పరిఽధిలో 2020 ఆగస్టు 26వ తేదీ వరకు రిజిస్టర్ అయిన అనధికార ప్లాట్లు, లేఅవుట్లను మాత్రమే క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు ఇప్పటికే ఫీజు వివరాలను ఫోన్‌ద్వారా మెసెజ్ పంపడం జరిగిందన్నారు. ఫోన్‌కు మెస్సెజ్ రాని వారు ఫీజు వివరాలను మున్సిపాలిటీకి వచ్చి తెలుసుకోవాలని సూచించారు. మార్జి 31వ తేదీలోపు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరించుకోవాలని, వారికే ఫీజులో 25 శాతం రాయితీ లభిస్తుందని చెప్పారు.
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
అయిజ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించారు. రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలపై వచ్చిన వినతిపత్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఏఈఓలతో సమావేశం నిర్వహించారు. అనంతరం సింగిల్‌విండో గోదాంను సందర్శించారు. స్టాక్ రిజిస్టర్‌ను, గోదాంలోని నిల్వలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఫర్టిలైజర్స్‌ను నిల్వ చేసుకోవాలని పీఏసీఎస్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జనార్ధన్, ఏఈఓలు పాల్గొన్నారు.
‘చెరుకు’ బకాయిలు
చెల్లించండి
అమరచింత: చెరుకు రైతులకు వెంటనే బకాయి డబ్బులు చెల్లించాలని చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ గోపి కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ డీజీఎం మురళికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. 2010–11 సంవత్సరం నుంచి రైతులు చెరుగు సాగు చేయడం ప్రారంభించారని తెలిపారు. మొదట్లో డ్రిప్, విత్తనాలు రాయితీపై అందించడమేగాక పెట్టుబడి సాయం ఇచ్చారని.. ఇప్పుడు అన్నీ ఎత్తివేసి మద్దతు ధర కూడా ఇవ్వకుండానే పంట కోతలు చేపడుతున్నారని వివరించారు. పంట కోతలు జరిగి 40 రోజులవుతున్నా నేటికీ డబ్బులు చెల్లించడం లేదని వివరించారు. 15 రోజుల్లో డబ్బులు చెల్లించకుంటే 16 శాతం వడ్డీతో చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బార్, నాయకులు అరుణ్, వెంకట్రాములు, వెంకటేశ్వర్లు, శివలక్ష్మి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీని సద్వినియోగం చేసుకోండి
Comments
Please login to add a commentAdd a comment