రోడ్లపైనే చెత్త పేరుకుంటుంది
ప్రధాన రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త తరలింపు సక్రమంగా జరగడం లేదు. ఊడ్చిన చెత్తను అక్కడే కుప్పులుగా పోసి తగలబెడుతున్నారు. దీంతో వ్యర్థాల నుంచి వచ్చే పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరికొన్ని కాలనీలలో చెత్తను గుంతలలో వేస్తున్నారు.
– అనిల్‌కుమార్, గద్వాల
డంపింగ్ బిన్‌లు లేవు..
మా కాలనీలో అక్కడక్కడ డంపింగ్‌బిన్‌లు వుండేవి. ప్రస్తుతం అవి అగుపించకుండా పోయాయి. దీంతో చెత్తబండి రాని రోజు ఇళ్లలోని వారు చెత్తను రోడ్డుపై పారబోస్తున్నారు. రాజోళి రోడ్డుకు ఇరువైపులా చెత్తాచెదారం, డ్రెయినేజీ శుభ్రం చేయకపోవడంతో కంపు కొడుతుంది. రోడ్లపై చెత్త వుండకుండా చర్యలు తీసుకోవాలి. – నర్సింహులు,
ఇందిరానగర్ కాలని, శాంతినగర్
ఆరుబయట చెత్త
వేయకుండా చూడాలి
మున్సిపాలిటీలోని వివిధ కాలనీల్లో కొందరు వ్యక్తులు చెత్తను మురుగు కాల్వల్లో, ఖాళీ ప్రదేశాల్లో గుమ్మరించి వెళ్తున్నారు. గాలికి పొడిచొత్త చెల్లాచెదారంగా రోడ్లపై పడుతుంది. కొన్ని సందర్భాల్లో నివాస గృహాల్లోకి చెత్త ఎగిరి వస్తోంది. చెత్తను రోడ్లపై, మురుగుకాల్వల్లో వేసే వారికి మున్సిపల్ అధికారులు జరిమానా విధించాలి. అప్పడైతేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది. – భాషా, అయిజ
●
రోడ్లపైనే చెత్త పేరుకుంటుంది
రోడ్లపైనే చెత్త పేరుకుంటుంది
Comments
Please login to add a commentAdd a comment