ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
గద్వాల: పేదింటి ఆడపడచులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. గద్వాల పట్టణం, ధరూరు, మల్దకల్, గట్టు, కెటి.దొడ్డి మండలాలకు చెందిన 40మంది మహిళలకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు బాబర్, మురళి, ప్రభాకర్‌రెడ్డి రామన్‌గౌడ తదితరులు పాల్గొన్నారు. అలాగే, పేదలకు మెరుగైన వైద్యం కోసం సీఎం రిలీఫ్‌ఫండు నిధులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
జములమ్మ హుండీ ఆదాయం రూ.27.78 లక్షలు
గద్వాల న్యూటౌన్: గద్వాల ప్రాంతంలో ప్రసిద్దిగాంచిన జములమ్మ, పరుశరామస్వామి ఆలయ హుండీని శుక్రవారం ఆలయంలో లెక్కించారు. గడిచిన 65రోజులకు గాను హుండీని లెక్కించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ డివిజన్ పరిశీలకురాలు వెంకటేశ్వరీ, ఈఓ పురందర్‌కుమార్, చైర్మన్ వెంకట్రాములు, యూబీఐ అధికారులు శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్ సమక్షంలో సిబ్బంది, భక్తులు లెక్కించారు. నగదు రూ.27,78,778, మిశ్రమ బంగారం 27గ్రాములు, మిశ్రమ వెండి 640 గ్రాములు ఆదాయంగా వచ్చింది. గడిచిన ఏడాది ఇదే సమయానికి జరిగిన లెక్కింపుతో పోల్చితే రూ.50,739 అధికంగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా, ఆలయాన్ని గద్వాల సంస్థాన వంశస్థులు శ్రీకృష్ణరాంభూల్ సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈసందర్బంగా ఆయన అమ్మవారికి పూజలు జరిపించారు. అనంతరం అధికారులు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది ఉన్నారు.
వేరుశనగ క్వింటా రూ.5,969
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు శుక్రవారం 1388 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.5969, కనిష్టం రూ.3119, సరాసరి రూ.5619 ధరలు పలికాయి. అలాగే, 19 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6404, కనిష్టం రూ.6289, సరాసరి రూ.6289 ధరలు వచ్చాయి. 65 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 6091, కనిష్టం రూ. 5669, సరాసరి రూ. 6059 ధరలు వచ్చాయి. 7 క్వింటాళ్ళ వరి (సోన) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి ధర రూ.1964 ధర లభించింది.
ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం