నెరవేరని తడి, పొడి చెత్త సేకరణ లక్ష్యం
గద్వాల మండలం గోనుపాడు శివారులో సుమారు పది ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి చుట్టు ప్రహరీ నిర్మించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో నిత్యం 20 నుంచి 22 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అందులో 70 శాతం చెత్త మాత్రమే డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మిగిలిన చెత్తను రోడ్ల పక్కన, గుంతలలో పారవేస్తున్నారు. అయితే ఇంటింటి చెత్త సేకరణ కొన్ని వార్డులలో సక్రమంగా జరగడం లేదు. వాహనాలల్లో సిబ్బంది అన్ని రకాల చెత్తను కలిపి సేకరిస్తుండటంతో తడి,పొడి చెత్త సేకరణ లక్ష్యం నెరవేరడం లేదు. ప్రతి రోజు చెత్తను వేరుచేసి సేకరించాల్సిన ఉన్నా సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇంటింటికీ ఉచితంగా రెండు రకాల బుట్టలు పంపిణీ చేసినప్పటికి ప్రజలు కూడా తమ ఇళ్లలోని చెత్తను ఇష్టానుసారంగా పేర్చి అందజేస్తున్నారు. డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్త నుంచి వేరువేరుగా కంపోస్టు ఎరువు, పొడి వనరులను తయారు చేయడానికి కేంద్రాన్ని నిర్మించారు. అది ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. మొదట్లో కంపోస్టు ఎరువు, చెత్త రీసైక్లింగ్ ప్రక్రియ చెపట్టి వదిలేశారు. చెత్త, ఆకులు, చెట్ల కొమ్మలు, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువుల డంపింగ్ యార్డులో గుట్టలు, గుట్టులుగా ఉండటం... వేసవిలో వాటికి కొన్సిసార్లు ఆగ్గిరాజుకుని మంటలు చెలరేగాయి. ఇలాంటి సందర్భాలలో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. డంపింగ్ యార్డులో తాత్కాలిక చర్యలు తప్ప, శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడంలో ప్రజలను భాగస్వాములయ్యేలా చైతన్యపరచడానికి నిరంతర కార్యక్రమాలు చేపట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment