వినియోగదారుల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
గద్వాలటౌన్: వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రియదర్శిణి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మీనాక్షి పేర్కొన్నారు. శనివారం కళాశాలలో అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విక్రయాల సమయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ఏ వస్తువు కొనుగోలు చేసినా విఽధిగా రశీదు పొందాలని సూచించారు. వస్తువు నకిలీదైనా.. మోసపోయామని గుర్తించినా తిరిగి పరిహారం చెల్లించడంలో ఇది ఉపకరిస్తుందని చెప్పారు. బాధితులు పూర్తి వివరాలతో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తే తగిన న్యాయం జరుగుతుందన్నారు. ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైతం వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ చంద్రమోహన్ వినియోగదారుల హక్కుల గురించి వివరించారు.
‘ఆరోగ్యశ్రీ’ సేవలకు
అవకాశం కల్పించాలి
అలంపూర్: అలంపూర్ నియోజకవర్గం ఆంధప్రదేశ్‌లోని కర్నూలుకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ ప్రాంత ప్రజలు వైద్యసేవల కోసం కర్నూల్‌పై ఆధారపడతారని, అక్కడి రెండు ఆస్పత్రుల్లో ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందేలా అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు. శనివారం శాసన మండలి సభ సమావేశాలు జరగగా.. ఈమేరకు ఎమ్మెల్సీ మాట్లాడారు. రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న అలంపూర్ నియోజకర్గ సమస్యలను శాసన మండలి దృష్టికి తీసుకెళ్లారు. అలంపూర్ ప్రాంతంలోని చాలామంది రైతులకు ఎప్పటి నుంచో కర్నూల్‌లో బ్యాంకు రుణాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ కర్నూల్‌లో బ్యాంక్ ఖాతాలు ఉన్న రైతులకు చేయలేదని సభాపతి దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఎమ్మెల్యే విజయుడుతో కలిసి మంత్రికి విన తి పత్రం అందజేసినట్లు తెలి పారు. కానీ కర్నూల్‌లో ఖాతా లు ఉన్న రైతులకు రుణ మాఫీ చేయలేదని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కర్నూల్‌లో ఖాతాలు ఉన్న రైతులకు రుణ మాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మన ప్రాంత రైతులు, మన ప్రాంత భూములు కేవలం బ్యాంక్ ఖాతా కర్నూల్‌లో ఉండటంతో రుణ మాఫీ కాలేదన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిసారించి కర్నూల్‌లో రుణాలు పొందిన రైతులకు రుణ మాఫీ వర్తింపజేయాలని కోరారు. గవర్నర్ ప్రసంగంలో అభివృద్ధి పనులకు సంబందించిన అంశాలు లేవని తెలిపారు. సరిహద్దులో ఉన్న అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించడానికి చొరవ చూపాలని కోరారు.
అభివృద్ధే లక్ష్యంగా
ముందుకు
ఆత్మకూర్/అమరచింత/మదనాపురం: మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కాదని ప్రజలు తనను గెలిపించారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తానని, అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగుతానని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం ఆత్మకూర్ మండలం తిప్పడంపల్లి, బాలకిష్టాపూర్‌లో పార్టీ జెండాలను ఆవిష్కరించడంతో పాటు తిప్పడంపల్లిలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అలాగే అమరచింత ఏడో వార్డులో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, మదనాపురం మండలం గోపన్‌పేటలో బీజేపీ జెండా ఆవిష్కరించి వివిధ పార్టీలకు చెందిన 40 మంది పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రం నిరుపేదలకు పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లని డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. అర్హులందరికీ ఇళ్లు ఇప్పిస్తానని, గ్రామాల్లో హైమాస్ట్ వీధిదీపాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే రేవంత్‌రెడ్డి పయనిస్తున్నారని.. కేంద్రానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురాల్లో నీటి ఇబ్బందులు దూరం చేయడానికే కేంద్రం అమృత్ 2.0 పథకం తీసుకొచ్చిందన్నారు.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
Comments
Please login to add a commentAdd a comment