ఎర్రవల్లి: సర్కారు బడుల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంతో మరింత ప్రభావవంతంగా విద్యా బోధన అందించనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం ఎర్రవల్లి మండలంలోని కొండేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్ ఏఎక్స్‌ఎల్ కంప్యూటర్ ల్యాబ్‌ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న వసతులను పరిశీలించారు. ఏఐ ఆధారిత బోధన పద్ధతులను వీక్షించి ఉపాద్యాయులకు పలు సూచనలు అందించారు. విద్యార్థుల అభ్యాసాన్ని ఆకర్శనీయంగా, ఇంటరాక్టివ్‌గా మార్చేందుకు ఏఐ కీలకంగా సహకరిస్తుందని అన్నారు. 26 ప్రభుత్వ పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఏఐ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఫౌండేషనల్ లిటరసీ, న్యూమెరసీ ప్రాథమిక విద్యా స్థాయిలో ఏఐ ఆధారిత డిజిటల్ పద్ధతుల ద్వారా ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, సంఖ్యాపరమైన విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారని తెలిపారు. దీనికోసం పాఠశాలల్లో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పూర్తి స్థాయి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ నరేష్, ఎంఈఓ అమీర్‌ఫాష, హెచ్‌ఓం శ్రీనివాసులు, జిల్లా కోఆర్డినేటర్ ఎస్తర్ రాణి తదితరులు పాల్గొన్నారు.
పట్టుదలతో చదివితే లక్ష్య సాధన
ఎర్రవల్లి: విద్యార్థులు పట్టుదలతో కష్టపడి చదివితే జీవితంలో ఏ లక్ష్యమైనా సాధించగలరని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని సరస్వతి పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలలు కనే ప్రతి ఒక్కరూ వాటిని నిజం చేసుకునే ధైర్యం, పట్టుదలను కలిగి ఉండాలన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారో కాదు, మీ లక్ష్యం ఎంత గొప్పదో, దాని కోసం ఎంత కృషి చేస్తున్నారో, అదే మీకు నిజమై న విజయాన్ని నిర్దేశిస్తుందని అన్నారు. విద్యార్థులు చదువులో మాత్రమే కాకుండా క్రీడలు, శారీరక విద్య, మౌళిక నైపుణ్యాల్లో కూడా రాణించాలన్నారు. అనంతరం గత ఏడాది సబీఎస్‌ఈ 10వ తరగతి టాపర్ తల్లిదండ్రులను కలెక్టర్ మెమోంటోలను అందజేశారు. గోవర్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.