మున్సిపల్‌ బడ్జెట్‌ రూ.15.29 కోట్లు | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ బడ్జెట్‌ రూ.15.29 కోట్లు

Published Wed, Apr 2 2025 12:29 AM | Last Updated on Wed, Apr 2 2025 12:29 AM

మున్స

మున్సిపల్‌ బడ్జెట్‌ రూ.15.29 కోట్లు

గద్వాలటౌన్‌: మున్సిపల్‌ బడ్జెట్‌ అంటే.. గతానికి పేరడీగా, అంకెల గారడీగా.. మొత్తం కాగితాలకే పరిమితమనే విమర్శలున్నాయి. అయితే, ఈ సారి గద్వాల పట్టణ ప్రగతి లక్ష్యంగా లెక్కల పద్దులు తయారు చేశారు. ప్రత్యేక పాలనలో మున్సిపల్‌ బడ్జెట్‌ ఏకరీతిలో ఉండేలా లెక్కలు వేశారు. కలెక్టర్‌ సారథ్యంలో బడ్జెట్‌ను రూపొందించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్‌ బడ్జెట్‌ రూ.15.29 కోట్లుగా నిర్ణయించి, గత నెల ఆమోదించారు.

సొంత నిధులతో..

ఈ సారి బడ్జెట్‌లో మున్సిపల్‌ శాఖ ద్వారా వచ్చే ఆదాయంతోనే బడ్జెట్‌ తయారు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లను పరిగణలోకి తీసుకుంటుండగా మొదట సొంతంగా వచ్చే నిధులు సమకూర్చుతున్నారు. గద్వాల మున్సిపాలిటీ నుంచి ఏడాదికి రూ.6 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఆస్తిపన్ను, నల్లా పన్ను, ఇంటి అనుమతుల జారీ, దుకాణాల అద్దెలు, ట్రేడ్‌ లైసెన్స్‌ తదితర వాటి నుంచి ఈ నిధులు వస్తాయి. వాటిని పక్కాగా ఖర్చు చేసే విధంగా బడ్జెట్‌ను రూపొందించి ఆమోదించారు.

పచ్చదనానికి 10 శాతం..

ఈ ఏడాది ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లోను 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌గా రూపొందించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం పచ్చదనానికి మొదట ప్రాధాన్యం ఇస్తున్నారు. మొక్కల పెంపకం, నర్సరీల నిర్వహణ, ట్రీ గార్డులు, ట్యాంకర్లు తీసుకోవడం వంటి వాటికి బడ్జెట్‌లో డబ్బులు ఖర్చు పెట్టనున్నారు. మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌తో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించారు.

మూడో వంతు విలీన కాలనీల అభివృద్ధికి

మున్సిపల్‌ పరిధిలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. బడ్జెట్‌లో మూడో వంతు(మూడింట ఒక బాగం) మురికివాడలు, శివారు, విలీన కాలనీల్లో అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం కల్పించారు. నిధులు పక్కాగా ఖర్చు అయ్యే విధంగా స్థానికంగా ఉండే ఆయా వార్డుల అధికారులు చూడాల్సి ఉంటుంది.

వీటికి ప్రాధాన్యం

బడ్జెట్‌ తయారీలో కొన్ని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు. దానికి అనుగుణంగా బడ్జెట్‌లో పద్దులు పొందుపర్చారు. పారిశుద్ధ్య నిర్వహణ, వాటికి అవసరమయ్యే వాహనాలు, పరికరాల కొనుగోలు, వీధి దీపాల నిర్వహణ, నీటి సరఫరా నిమిత్తం విద్యుత్‌ బిల్లుల చెల్లింపులతో పాటు ఏదైనా రూపంలో రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్‌లో రూపొందించారు. రాబోయె ఏడాది కాలంలో ప్రతిపాదిత ఆదాయ, వ్యయాలను బడ్జెట్‌లో చూపించారు. అలాగే, ప్రత్యేకంగా కొన్ని పనుల నిమిత్తం పలు రకాల పనులకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు ఉండాలి. పట్టణ ప్రగతిలో భాగంగా వచ్చే నిధులను అందులో పొందుపర్చారు. పార్కులు, వైకుంఠధామాలు, క్రీడా స్థలాల ఏర్పాటు, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, సమీకృత మార్కెట్లు, శాసీ్త్రయ పద్దతిలో డంపింగ్‌ యార్డుల నిర్వహణ వంటి పనులకు ప్రాధాన్యం ఇచ్చి నిధులను కేటాయింపులు చేశారు.

గద్వాల శివారు, విలీన కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యం

10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌

ప్రగతిపైనే ఆశలు

జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ ప్రగతి అక అడుగు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఐదేళ్ల పాలకవర్గ హయంలో సుమారు రూ.10 కోట్లతో ఆయా వార్డుల్లో ప్రగతి పనులు జరిగాయి. అయినా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలెన్నో ఉన్నాయి. ప్రస్తుతం నిధుల కొరతతో కొత్తగా పనులు చేపట్టే ప్రణాళికలు చేపట్టడం లేదు. ఉన్నదాంట్లో సమకూరిన నిధులను కార్మికుల వేతనాలకు వినియోగిస్తున్నారు. అయినా ఇంకా రెండు నెలల జీతాలు బకాయిలున్నాయి.

మున్సిపల్‌ బడ్జెట్‌ రూ.15.29 కోట్లు 1
1/1

మున్సిపల్‌ బడ్జెట్‌ రూ.15.29 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement