రైతుల అభ్యున్నతికి కృషి
అయిజ: రైతులకు అన్నిరకాలుగా చేయూతనిచ్చేందుకే పీఏసీఎస్‌లు పనిచేస్తున్నాయని, రైతులు అభ్యున్నతికోసం అందరం కృషిచేద్దామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయం ఆవరణలో అయిజ సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన పీఏసీఎస్ చైర్మన్‌లు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 78 సహకార సంఘాలు ఉన్నాయని, వాటిలో అయిజ పీఏసీఎస్‌లో ఎక్కవమంది ఉద్యోగులను నియమించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలుచేస్తున్నాయని అన్నారు. వ్యవసాయం కోసం అతి తక్కువ వడ్డీతో పంట రుణాలు ఇవ్వడంతోపాటు దీర్ఘకాలిక రుణాలను ఇస్తుందని, ట్రాక్టర్, హార్వెస్టర్, డ్రోన్స్ తదితర వ్యవసాయ వస్తువులు కొనుగోలుకు చేసేందుకు కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. సొసైటీలు కేవలం రైతులకు రుణాలు ఇచ్చేవిగా ఉండరాదని, రైతులకు మేలుచేయడంతోపాటు సొసైటీ ఆదాయాన్ని పెంచుకునేందకు అనేక రకాల కార్యకలాపాలను చేపట్టాలని పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఈర్లదిన్నె రంగారెడ్డి, అలంపూర్ క్యాతూర్, కలగొట్ల, మానవపాడు, వడ్డెపల్లి, గట్టు సహకార సంఘాల చైర్మెన్‌లు మోహన్‌రెడ్డి, రాఘవరెడ్డి, గజేంద్ర రెడ్డి, శ్రీధర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, క్యామ వెంకటేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment