యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక | - | Sakshi
Sakshi News home page

యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక

Published Sat, Mar 22 2025 1:20 AM | Last Updated on Sat, Mar 22 2025 1:15 AM

యువిక

యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక

ఇస్రో ఆధ్వర్యంలో యువ విజ్ఞాని కార్యక్రమానికి శ్రీకారం

ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నవిద్యార్థులకు సదావకాశం

ఆన్‌లైన్‌లో అందుబాటులో ఇస్రో ప్రత్యేక వెబ్‌సైట్‌

రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ

ఉమ్మడి జిల్లాలో 45,969 మంది విద్యార్థులు

నారాయణపేట రూరల్‌: విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. యువికా (యువ విజ్ఞాని కార్యక్రమం) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటు సౌకర్యాలను ఇస్రోనే కల్పించనుంది. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో 45,969 మంది 9వ తరగతి విద్యార్థులు ఉండగా ఇందులో ఎంత మంది ఔత్సాహికులు ముందుకు వస్తారో వేచి చూడాల్సి ఉంది.

దరఖాస్తు విధానం..

విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదట వారి ఈమెయిల్‌ ఐడీతో ఇస్రో వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ క్విజ్‌లో పాల్గొనాలి. క్విజ్‌ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతి, విద్యార్థి గత మూడేళ్లలో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి.

ఈ నెల 23 వరకు..

దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పించారు. ఎంపికై న విద్యార్థుల తొలి జాబితాను ఏప్రిల్‌ 7న అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. ఎంపికై న విద్యార్థులు మే 18న ఇస్రో కేంద్రాల వద్ద రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. మే 19 నుంచి మే 30 వరకు ఎంపికై న విద్యార్థులకు 7 శిక్షణ కేంద్రాల్లో యువికా కార్యక్రమం నిర్వహిస్తారు.

ఎంపిక విధానం ఇలా..

ఈ విద్య సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. 8వ తరగతిలో పొందిన మార్కులు, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్‌ ప్రతిభ పరీక్షలు, ఒలింపియాడ్‌లో పాల్గొని మొదటి, మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. రిజిష్టర్డ్‌ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినవారు, స్కౌట్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లో సభ్యులుగా ఉండటం, ఆన్‌లైన్‌ క్విజ్‌లో ప్రతిభ చూపిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది.

వేసవిలో శిక్షణ..

శిక్షణకు ఎంపికై న విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 19 నుంచి 30 వరకు 12 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తిగా రెసిడెన్షియల్‌ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్‌ ఉపాధ్యాయుడికి కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌కు తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు.

ఇవీ కేంద్రాలు..

విద్యార్థులను ప్రోత్సహించాలి..

వైజ్ఞానిక పోటీల్లో పాల్గొనేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన, అంతరిక్ష పరిశోధనా రంగాలపై ఆసక్తి పెంపొందించడానికి యువికా తోడ్పడుతుంది. ఎంపికై న విద్యార్థులకు స్పేస్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తారు.

– భానుప్రకాష్‌,

జిల్లా సైన్స్‌ అధికారి, నారాయణపేట

No comments yet. Be the first to comment!
Add a comment
యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక 1
1/2

యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక

యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక 2
2/2

యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement