మొదటిరోజు 99.58 శాతం హాజరు
గద్వాలటౌన్: పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 7,597 మంది విద్యార్థులకుగాను 7,565 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 32 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. 99.58 శాతం హజరు నమోదైంది. మొత్తం 40 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక అంధుల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు సహాయకుల సహాయంతో పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు బెంచీలను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని గదులలో వెలుతురు సక్రమంగా లేక, ఫ్యాన్ల కొరతతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. తాగునీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. మొత్తం తొమ్మిది ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు వేర్వేరుగా జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. పరీక్ష ముగిసే వరకు అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచారు. విద్యార్థులను గంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.
కలెక్టర్, ఎస్పీ తనిఖీ
పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్‌రావు వేర్వేరుగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలలో ఉన్న మౌలిక సదుపాయాలను వారు పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లోని సిబ్బంది తప్పని సరిగా గుర్తింపు కార్డు ధరించి ఉండాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, విద్యారుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాల్ ప్రాక్టీస్‌కి అవకాశం లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాస్‌రావు
Comments
Please login to add a commentAdd a comment