పరిష్కారం చూపండి సారూ.. | - | Sakshi
Sakshi News home page

పరిష్కారం చూపండి సారూ..

Published Sun, Mar 23 2025 1:00 AM | Last Updated on Sun, Mar 23 2025 12:59 AM

పరిష్

పరిష్కారం చూపండి సారూ..

ఫోన్‌– ఇన్‌

గద్వాల: తాగునీరు, డ్రెయినేజీ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి.. పది శాతం స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి.. పురాతన కట్టడాలను ఆక్రమిస్తున్నారు అంటూ పట్టణ ప్రజలు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపుతామని అదనపు కలెక్టర్‌, మున్సిపాలిటీల ప్రత్యేకాధికారి నర్సింగ్‌రావు పేర్కొన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు గద్వాల, అయిజ, వడ్డేపల్లిలో నెలకొన్న వివిధ రకాల సమస్యలపై ‘సాక్షి’ శనివారం అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావుతో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించగా అపూర్వ స్పందన లభించింది. ప్రజలు సంధించిన ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు ఇలా..

ప్రశ్న : జిల్లాకేంద్రంలోని పురాతన బావిని కబ్జా చేశారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.?

– మోహన్‌రావు, శంకర ప్రభాకర్‌, గద్వాల

ప్రత్యేకాధికారి : మీరు చెప్పిన విషయం వాస్తవమే. దీనిపై ఇది వరకే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. పురాతన కట్టడాలను కబ్జా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుని వాటిని కాపాడుతాం.

ప్రశ్న : చెత్త సేకరించడం లేదు. కొన్నిచోట్ల మధ్యాహ్నం సమయంలో చెత్త తీసుకెళ్లడానికి వస్తున్నారు. ఈ సమయంలో ఉద్యోగులమంతా డ్యూటీలకు వెళ్తున్నాం. ఇంట్లో చెత్త పేరుకుపోయింది. అదేవిధంగా కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే పిల్లలపై దాడి చేసి గాయపరిచాయి.

– ప్రవీణ్‌, కొత్తహౌసింగ్‌బోర్డు కాలనీ, గద్వాల

ప్రత్యేకాధికారి : చెత్త సేకరణను క్రమం తప్పకుండా ఉదయం వేళలో తీసుకెళ్లేలా పురమాయిస్తాం. అదేవిధంగా కుక్కల బెడదను అరికట్టేలా స్టెరిలైజేషన్‌ ప్రక్రియ చేపట్టి.. ఇబ్బంది లేకుండా చేస్తాం.

ప్రశ్న : తేరుమైదానం వద్ద ఉన్న ప్రధాన రోడ్డును ఆక్రమిస్తూ డబ్బాలు పెడుతున్నారు. ఫలితంగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. – ఖరీంపాష, అశోక్‌నగర్‌, గద్వాల

ప్రశ్న : గద్వాల మున్సిపాలిటీ పరిధిలో సర్వే నం.789, సర్వే నం.389లో 10 శాతం స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. వీటిని కాపాడి రక్షణ కంచె ఏర్పాటు చేయాలి.

– రాఘవేంద్ర, న్యూహౌసింగ్‌బోర్డు కాలనీ, గద్వాల

ప్రత్యేకాధికారి : ఈ రెండు సర్వే నంబర్లకు సంబంధించి మోఖపై వెళ్లి రికార్డుల ఆధారంగా విచారిస్తాం. కబ్జాకు గురైతే తప్పకుండా చర్యలు తీసుకుని వాటిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా రక్షణ కంచె ఏర్పాటు చేసి మున్సిపల్‌ బోర్డులు ఏర్పాటు చేస్తాం.

ప్రశ్న : జయప్రజావైద్యశాల పక్కన అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా వంద గజాల స్థలంలో ఆరు అంతస్తులు భవనం నిర్మిస్తున్నారు. పైగా ఎలాంటి సెట్‌బ్యాక్‌ కూడా లేదు. దీంతో ట్రాఫిక్‌ సమస్య, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. దీనిపై పత్రికలో వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

– ప్రసాద్‌, నల్లకుంట, గద్వాల

ప్రత్యేకాధికారి : నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడితే వెంటనే పనులు ఆపేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న : ఫ్‌లై ఓవర్‌ పక్కన పెద్ద ఆస్పత్రి సమీపంలో 12 ఇళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఒక్క డ్రెయినేజీ, సీసీరోడ్లు లేవు. దీంతో ఇళ్ల నుంచి వచ్చిన మురుగు రోడ్లపైనే పారుతోంది. వానాకాలంలో నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం.

– ఇస్మాయిల్‌, గద్వాల

ప్రత్యేకాధికారి : మున్సిపల్‌ ఏఈని పంపించి నివేదిక తెప్పించుకుంటాం. డ్రెయినేజీ, అంతర్గత రహదారులు నిర్మించేలా చూస్తాం.

ప్రశ్న : అయిజ దుర్గానగర్‌లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. అలాగే ఠాగూర్‌ స్కూల్‌ వద్ద మురుగు రోడ్డుపైకి వచ్చి చేరుతుండడంతో ఇబ్బంది పడుతున్నాం. – భీంసేన్‌రావు, అయిజ

ప్రత్యేకాధికారి : అధికారులను పంపి డ్రెయినేజీ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న : అయిజ 20వ వార్డులో నారాయణస్వామి ఆలయం వద్ద తాగునీటి సమస్య ఉంది. అలాగే కరెంట్‌ స్తంభాలు లేక ఇబ్బందులు పడుతున్నాం.

– జగదీశ్వర్‌, అయిజ

ప్రత్యేకాధికారి : ఏఈని పంపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. అలాగే కరెంట్‌ స్తంభాల సమస్య కూడా పరిష్కరిస్తాం.

ప్రశ్న : ప్రతి శుక్రవారం శాంతినగర్‌లో సంత జరుగుతుంది. కానీ, సంతకు ప్రత్యేక స్థలం లేకపోవడంతో రోడ్లపైనే అంగళ్లు ఏర్పాటు చేిస్తుండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – వెంకటేశ్వర్లు, వడ్డేపల్లి

ప్రశ్న : వడ్డేపల్లి 5, 6 వార్డుల్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. – పావని, వడ్డేపల్లి

ప్రత్యేకాధికారి : శాంతినగర్‌లో సంత ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తాం.

ప్రశ్న : అయిజలోని 8వ వార్డులో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాం. ముళ్ల కంపలు పెరిగినా పట్టించుకోవడం లేదు. అలాగే కరెంట్‌ స్తంభాలు వాలిపోయి విరిగే ప్రమాదం ఉంది. ప్లాిస్టిక్‌ వాడకం కూడా అధికంగా ఉంది. – భగత్‌రెడ్డి, అయిజ

ప్రత్యేకాధికారి : డ్రెయినేజీ సమస్య, ముళ్లకంపల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. పాడైపోయిన చోట కరెంట్‌ స్తంభాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తాం. ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రజలు సహకరించాలి.

ప్రశ్న : అంబాభవాని ఆలయం దగ్గర డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. కాల్వలు లేకపోవడంతో మురుగంతా రోడ్లపైకి వచ్చి చేరుతుంది. దీంతో దోమల బెడద, దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

– ఎల్లప్ప, 9వ వార్డు, గద్వాల

ప్రత్యేకాధికారి : డ్రెయినేజీ నిర్మాణం కోసం సిబ్బందిని పంపి వివరాలు తెలుసుకుంటాం. అప్పటి వరకు మురుగు రోడ్డుపైకి రాకుండా అవసరమైన చర్యలు చేపడుతాం. దోమల నివారణకు ఫాగింగ్‌ చేస్తాం.

ప్రశ్న : అయిజలోని కోట్లవీధిలో తాగునీటి సమస్య ఉంది. మిషన్‌ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదు. అంబేడ్కర్‌ చౌరస్తాలో పెద్దపాటి గుంతలు ఉండటంతో ప్రమాదాలకు గురవుతున్నాం. తిక్కవీరేశ్వరస్వామి గుడి వద్ద హై లెవెల్‌ మినీ వంతెన నిర్మిస్తే బాగుంటుంది. అంబేడ్కర్‌ చౌరస్తాలో సమీకృత మార్కెట్‌లో పూర్తయినా అందుబాటులోకి రాలేదు. అలాగే పట్టణంలోని ప్రధాన రహదారులపై స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి.

– రామచంద్రారెడ్డి, తిరుమల్‌రెడ్డి,

ఖదీర్‌, మహబూబ్‌, అయిజ

ప్రత్యేకాధికారి : అధికారులను పంపించి అవసరమైన చర్యలు చేపట్టి పరిష్కరిస్తాం.

ప్రశ్న : వడ్డేపల్లి 5, 6 వార్డుల్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది.

– పావని, వడ్డేపల్లి

ప్రత్యేకాధికారి : శాంతినగర్‌లో సంత ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తాం.

ప్రశ్న : శాంతినగర్‌లో గ్రంథాలయ భవనం ఏర్పాటు చేస్తే విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది.

– గాయత్రి, శాంతినగర్‌

ప్రత్యేకాధికారి : పరిశీలించి గ్రంథాలయం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం.

జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు

తాగునీరు, డ్రెయినేజీ సమస్యలపై ప్రజల ఏకరువు

అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ప్రత్యేకాధికారి నర్సింగ్‌రావు

‘సాక్షి’ ఫోన్‌– ఇన్‌ కార్యక్రమానికి అపూర్వ స్పందన

ప్రశ్న : 28వ వార్డులో తాగునీరు దుర్వాసనతో వస్తుంది. వాటర్‌ టెస్టింగ్‌ చేయించి సురక్షితమైన తాగునీటిని అందించాలి. అలాగే చారిత్రాత్మకమైన గద్వాల కోటను సంరక్షించే చర్యలు చేపట్టాలి.

– రామ్‌నాథ్‌, 28వ వార్డు, గద్వాల

ప్రత్యేకాధికారి : 28వ వార్డులో తాగునీటి శాంపిల్‌ తీసుకుని టెస్టింగ్‌ చేయిస్తాం. సురక్షితమైన తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు చేపడుతాం. అలాగే గద్వాల కోటను సంరక్షించుకునేందుకు కలెక్టర్‌తో మాట్లాడి అవసరమైన చర్యలు చేపడుతాం.

ప్రశ్న: డ్రెయినేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై అధికారులు, వార్డు నాయకులకు చెప్పినా పరిష్కారం కాలేదు.

– పూజారి కృష్ణ, వెంకటరమణ కాలనీ, గద్వాల

ప్రత్యేకాధికారి : మీరు చెప్పిన ప్రాంతానికి ముందుగా సిబ్బందిని పంపించి సమస్యను పూర్తిస్థాయిలో తెలుసుకుంటాం. ఆ తర్వాత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

No comments yet. Be the first to comment!
Add a comment
పరిష్కారం చూపండి సారూ.. 1
1/1

పరిష్కారం చూపండి సారూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement