గద్వాల: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలంటే స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి గంటాకవితాదేవి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ణాన సదస్సులో ముఖ్యఅథితిగా ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా ఎదగాలని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలన్నారు. పొదుపు సంఘాల మహిళలు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, సంగీత పాల్గొన్నారు.
ట్రాన్స్‌కో ఎస్‌ఈగా
శ్రీనివాస్‌రెడ్డి
గద్వాల: ట్రాన్స్‌కో ఎస్‌ఈగా శ్రీనివాస్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు ఎస్‌ఈని విద్యుత్ శాఖ ఉద్యోగులు మర్యాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని.. ఉత్తమ సేవలందించాలని ఆయన సిబ్బందికి సూచించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు
10 అర్జీలు
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 10 అర్జీలు అందాయని ఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. గద్వాల– అలంపూర్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాధితులకు వివరించారు.
బీచుపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శివుడికి అభిషేకాలు చేశారు. సోమవారం కావడంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని శివాలయంతోపాటు అభయాంజనేయస్వామి, జ్ఞానసరస్వతి, సీతారాముల వారిని దర్శించుకున్నారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి